రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు
నిర్దేశం, హైదరాబాద్ః
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులకు పంట కోసం ఆర్థిక సాయం చేయడానికి బడ్జెట్ ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసేందుకు పెట్టుబడి సాయం కోసం బడ్జెట్ లో కేటాయింపులు చేసింది. రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా పథకానికిగానూ పద్దెనిమిది వేల కోట్ల (రూ.18,000 కోట్లు) రూపాయలు తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26లో కేటాయించారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వచ్చే వార్షిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి.రైతులకు గత ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు పంట పెట్టుబడి సాయం ఇచ్చేంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.12 వేలకు పెంచి అమలు చేస్తోంది. ఖరీఫ్ సీజన్ కు రూ.6 వేలు, రబీ సీజన్లో పంట పెట్టుబడి సాయం రూ.6 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.