గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
ఇద్దరు నర్సింగ్ విద్యార్థుల దుర్మరణం
గద్వాల, నిర్దేశం:
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు-చేసుకుంది. జిల్లా కేంద్రంలో నర్సింగ్ విద్యార్థులను బోలేరా వాహనం డీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఐదుగురు విద్యార్థినులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడని వారిని గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు- వైద్యులు తెలిపారు. నర్సింగ్ కాలేజ్ నుంచి హాస్టల్ కు వెళ్లే క్రమంలో బస్ పాయింట్ దగ్గర ఆగినప్పుడు ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
గద్వాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థిణులు మృతి చెందడం పట్ల ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న అమ్మాయిలు, చిన్న వయసులోనే ఇలా మరణించడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సంతోష్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని వారికి సూచించారు. ఇదే ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న మరో విద్యార్థినికి అవసరమైన వైద్య సాయం అందించాలని కలెక్టర్‌ను, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి ప్రకటించారు. మరణించిన విద్యార్థిణుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.