కాంగ్రెస్ మీద గెలిచిన తీన్మార్ మల్లన్న
– తెలంగాణకు చివరి రెడ్డి సీఎం రేవంతేనట
– మల్లన్న మాటనే చెప్పిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
– కులగణన అనంతరం కాంగ్రెస్ లో మారుతున్న స్వరాలు
– బీసీల్లో పెరుగుతున్న చైతన్యం
– కాంగ్రెస్ లో రెడ్డి ఆధిపత్యం పోతుందా?
నిర్దేశం, హైదరాబాద్ః
కొంత కాలంగా తీన్మార్ మల్లన్న పదే పదే చెప్తున్న మాట ఏంటంటే.. తెలంగాణకు చిట్టచివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని, తర్వాత కాబోయేది బీసీ ముఖ్యమంత్రేనని. బహుశా.. దీన్ని మొదట్లో కాంగ్రెస్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ, మెల్లగా సీన్ మారిపోయింది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అచ్చం తీన్మార్ మల్లన్నలాగే స్పందించాడు. రేవంత్ రెడ్డి మరో నాలుగేళ్లు మాత్రమే సీఎంగా ఉంటాడని, ఆ తరువాత బీసీ నాయకుడు సీఎం అవుతాడని అన్నాడు.
గతంలో కొందరు మంత్రులు, కాంగ్రెసు నాయకులు రేవంత్ రెడ్డే పదేళ్లు సీఎంగా ఉంటాడని అన్నారు. కాని కులగణన నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నాయకులు బీసీ సీఎం మంత్రం జపిస్తున్నారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి కూడా నేనే చివరి రెడ్డి ముఖ్యమంత్రినైనా ఏం బాధపడను అని చెప్పాడు. తాజాగా ఈ విషయాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించాడు. ఈ 5 సంవత్సరాలు సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారని స్పష్టం చేశాడు. వచ్చే రోజుల్లో రాజకీయాలు అన్నీ బీసీ అజెండాగా జరుగుతాయన్నాడు. మరో అగుడు ముందుకు వేసి బీసీ సీఎం కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందన్నాడు. భవిష్యత్తులో తెలంగాణలో బీసీ వ్యక్తి సీఎం అవుతారన్నాడు.
తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్లపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. రేవంత్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చిన రోజుల వ్యవధిలోనే మహేశ్ కుమార్ గౌడ్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కుల గణన నేపథ్యంలో రేవంత్ ఆ తరహా వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు మహేశ్ కూడా అదే తరహాలో స్పందించడం గమనార్హం. తాజాగా మహేశ్ కుమార్ గౌడ్ బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలన్నది రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయమని చెప్పుకొచ్చాడు.
మహేశ్ కుమార్ గౌడ్ చెప్పదాన్నిబట్టి అర్థమయ్యేదేమిటంటే.. మరో నాలుగేళ్ల తరువాత కాంగ్రెసు అధికారంలోకి వస్తే బీసీ నాయకుడు సీఎం అవుతాడు. కాని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాత్రం కేసీఆర్ సీఎం అవుతాడు. మళ్లీ కేసీఆరే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు ఎప్పటి నుంచో అంటున్నారు. కాంగ్రెసు అధికారంలోకి వస్తే బీసీ సీఎం కావొచ్చేమోగాని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాత్రం బీసీ సీఎం అయ్యే అవకాశం ఉండదు