‘‘చట్టం తన పని తాను చేసుకు పోతుంది..’’ ఇది ఎప్పటి నుంచో ప్రభుత్వ అధినేతలు చెప్పే నీతి మాటలు. కానీ.. శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదానేది నిజం.. ఇగో.. ఇప్పుడు సినీ రంగంలో జరుగుతున్న పరిణామాలు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే అనేది జగమెరిగిన సత్యం.
రాజకీయం చాలా పవర్ పుల్.. అవకాశం దొరికితే శతృవును బంతిని చెండాడినట్లు ఆడుకోవడంలో వాళ్లకు వాళ్లే సాటి. తగ్గేదేలే అంటూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు హల్ చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ను అరెస్టు చేయించి తన సత్తా చాటుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా తన మార్క్ చూపించడంలో భాగంగా ‘‘చట్టం ముందు అందరూ సమానమే.. చట్టం తన పని తాను చేసుకు పోతుంది’’ అని వ్యాఖ్యానించారు. కానీ.. ఆయన సూచనల మేరకే అల్లు అర్జున్ ను అరెస్టు చేసారనేది కొట్టి పారేయలేని విషయం.
మొన్న అక్కినేని నాగర్జున ఎన్ కాన్వేన్షన్ కూల్చివేత..
అక్రమ నిర్మాణాల వల్ల చెరువులు కనుమరుగు అవుతున్నాయని భావించిన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. చెరువులను అక్రమించుకున్న వారి భరతం పట్టడానికి నిజాయితీగా, సిన్సియర్ గా పని చేసే ఐపీఎస్ ఆఫీసర్ రంగానాథ్ ను హైడ్రా బాస్ గా నియమించారు. అయితే.. అక్కినేని నాగర్జునకు చెందిన ఎన్ కాన్వేన్షన్ హైడ్రా కూల్చివేసిన సంఘటన సిని రంగంలో సంచలనం సృష్టించింది. రేవంత్ రెడ్డి సీఎంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని వర్గాలు అభినందించాయి.
ఇవ్వాళ అల్లు అర్జున్ అరెస్ట్..
పుష్ప 2 మూవీ విడుదల సందర్భంగా సంద్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన సంఘటన సంచలనం సృష్టించింది. అయితే.. తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన సకాలంలో పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ఆలస్యంగా స్పందించడం కూడా వివాదంగా మారింది. మృతురాలి కుటుంబానికి 25 లక్షలు ప్రకటించారు. ఇదే సందర్భంలో తనపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసును కొట్టి వేయాలని హైకోర్టు మెట్లు ఎక్కారు అల్లు అర్జున్. అయినప్పటికీ పోలీసులు హుటాహుటిన అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది.
రేపు మోహన్ బాబు అరెస్టు ఉంటుందా..?
మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహరంలో ఆ కుటుంభీకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీవీ 9 ప్రతినిధి రంజిత్ కుమార్ పై మోహన్ బాబు దాడి చేసిన కేసులో పోలీసులు హత్యయత్నం కేసును నమోదు చేశారు. అయితే.. మొన్న అక్రమంగా నిర్మాణం చేసిన అక్కినేని నాగర్జున ఎన్ కాన్వేన్షన్ కూల్చివేత… ఇవ్వాళ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం తరువాత రేపు మోహన్ బాబును హత్యయత్నం కేసులో అరెస్టు చేస్తారా..? లేదా అనే చర్చ అప్పుడే ప్రారంభమైంది.
చట్టం తన పని తాను ఎప్పుడు చేయదు.. చట్టం ప్రభుత్వ అధినేతల కనుసైగలలోనే పని చేస్తుందానేది అక్షరాల నిజం. కేసీఆర్ ప్రభుత్వంలో బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని దొంగను తీసుకెళ్లినట్లు చాలా పోలీసు స్టేషన్ లను తిప్పడం ఇప్పటికి మరిచి పోలేని నిజం.. ఇగో.. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం కక్ష సాధింపు కాకుండా పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగానే అరెస్టులు జరుగుతున్నాయని కాంగ్రెస్ వర్గీయులు సమర్థించుకుంటున్నారు.