రెడ్డి కాంగ్రెస్  వర్సెస్ బీసీ కాంగ్రెస్

రెడ్డి కాంగ్రెస్  వర్సెస్ బీసీ కాంగ్రెస్

హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, ఆధిపత్య పోరు, వర్గ విభేదాలు, సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ వార్ ఇలాంటివన్నీ సర్వసాధారణమే. ఇవి లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ ఊహించలేం. ప్రతిపక్షంలో ఉన్నా , అధికారం చేతికొచ్చినా తీరు మాత్రం సేమ్ టూ సేమ్. తాజాగా గ్రూపు రాజకీయాలు కాస్త ప్రక్కకు జరిగి ఇప్పుడు బిసి వర్సెస్ రెడ్డి సమాజిక వర్గం పేరుతో విమర్శల దాడి పెరిగింది. ఏదోో అలవోకగా వచ్చిన మాటలంటే కాదు , కాంగ్రెస్ లో జమానా కాలం నుండి ఉండికూాడా వాళ్లు మాట్లుతున్న మాటలు వింటుంటే ఇందేందిరా భయై కాంగ్రెస్ లొల్లి అనకతప్పడంలేదు. ఎందుకిలా ఒక్కరి తరువాత ఒకరు అన్నట్లు బిసి నేతలు కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారనేది కోటి డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

నిన్నగాక మొన్న తీన్మార్ మల్లన్న బిసి బహిరంగ సభలో రెడ్డి సామాజికవర్గంపై అగ్గిమీద గుగ్గిలంలా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి చివరి రెడ్డి సిఎం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 2028 ఎన్నికల్లో తెలంగాణకు బిసి ముఖ్యమంత్రి కాబోతున్నాడంటూ , బిప్ సౌండ్స్ వేయాల్సిన పదజాలంతో రెడ్డిసామాజిక వర్గంపై రెచ్చిపోయారు. కులగణన పేరుతో 42లక్షల మంది బిసిలను చంపేస్తారా, లెక్కలోనే లేకుండా చేస్తారా అంటూనే 16లక్షల మంది ఓసీ జనాభా ఎలా పెరిగారంటూ ప్రశ్నించారు.కులాల మధ్య చిచ్చురేపుతున్న నోటిదూల వెనుక వ్యూహం ఇదేనారేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన కులగణన సర్వేనే తగులబెట్టి, అది ఓ చెత్త సర్వే అంటూ రెచ్చిపోయారు. ఇలా బిసిలను ఐక్యం కావాలంటూనే రెడ్డి సామాజిక వర్గంపై చెలరేగిపోయారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్ మార్ మల్లన్న. బిఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అదేపనిగా ప్రభుత్వతీరును ఎండగడుతూ, కాంగ్రెస్ పార్టీ మనసు దోచుకున్న మల్ల, రేవంత్ రెడ్డి సహకారంతో పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం, ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే మల్లన్న రాజకీయ భవిష్యత్ కు మార్గం చూపింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రోత్సాహం. మరి ఇప్పుడు ఎందుకిలా రెడ్డి సమాజికవర్గంపై కత్తలు నూరుతున్నాడనేది అంతుచిక్కడంలేదు.ఒకవేళ రేవంత్ వ్యూహంలో మల్లన్న దూకుడు భాగమైతే అది రెడ్డి వర్గాన్నె ఎందుకు టార్గెట్ చేస్తారు. అలా చేయడం ద్వారా బిసిలు కాంగ్రెస్ కు మరింత దగ్గరవుతారని ఇలా సొంత ఇంట్లో కులం మంట పెట్టి చలికాచుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా రెడ్డి పాలన ,పెత్తనం ఇక చాలు, బిసిల ఓట్లు ఎలాగో ఎక్కువ , మనం అధికారం రావడానికిి ఏం తక్కువ అనుకుని ముందుకు దూసుకుపోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఇలా సొంత పార్టీలో మల్లన్న రేపిన కులం కుంపటి ఎంతరకూ కాంగ్రెస్ కు మేలు చేస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే తాజాగా మరో బిసి సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం, కాంగ్రెస్ పార్టీలో కొందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు తన రాజకీయ భవిష్యత్ కు దెబ్బకొట్టారని తీవ్ర ఆరోపణలు చేసారు.ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి అంటూ పేర్లు ప్రస్తావించి మరీ రెడ్డి సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.యాదవులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వరా అంటూ నిలదీశారు.రాహుల్ గాంధీ గట్టిగా చెబితేనే కులగణనకు ఈ రెడ్డి నేతలు ఒప్పుకున్నారని, లేదా కులగణన కూడా జరిగేదికాదంటూ మరో అడుగు ముందుకేసి సొంత పార్టీలో రెడ్డినేతలను రచ్చకీడ్చారు. సాధారణంగా వివాదాలకు ఆమడదూరంలో ఉందే అంజన్ కుమార్ యాదవ్ , ఒక్కసారిగా రెడ్డినేతలపై కత్తులు దూయడం వెనుక కారణాలేంటి..? ఈ ఇద్దరు నేతల మాటల తూటలచాటున దాదిన రాజకీయ వ్యూహంపై సర్వత్రా చర్చనడుస్తోంది. అంజన్ కుమార్ యాదవ్ దాదాపు రాజకీయాలకు దూరమైపోయారు అనుకున్న సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అవునన్నా, కాదన్నా రేవంత్ నాయకత్వంలో తన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ ఎంపీగా ప్రాధాన్యత దక్కింది. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా రేవంత్ కు అత్యతంత సన్నిహితుల్లో ఒకరు, తాను నమ్మిన కోర్ టీమ్ లో ఒకడు . మల్లన్న సైతం రేవంత్ తో సన్నిహితింగానే మెలుగుతున్నారు. బిఆర్ ఎస్ పై ప్రజావ్యతిరేకత కలగడంలో కీలకంగా వ్యవహరించారు. రేవంత్ సపోర్టుతో ఎమ్మెల్సీ  అయ్యారు. ఇలా రెడ్డివర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతలూ రేవంత్ కు సన్నిహితులే. మరెందుకు ఇలా ఆ సామాజివర్గాన్నే రెచ్చగొడుతున్నారనేది వెనుక పెద్ద వ్యూహమే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.బిసి కాంగ్రెస్,వర్సెస్ రెడ్డి కాంగ్రెస్ గా వేరుచేయడంతో మొదలై బిసిలకు ప్రాధ్యాన్యత ఇచ్చేలా చేస్తూ, తమ కాంగ్రెస్ సాధించిన ఘనతగా తిరిగి కాంగ్రెస్ కు బిసిలను ఫిక్స్డ్ ఓగ్ బ్యాంక్ గా మార్చాలనేది రేవంత్ వ్యూహం లో భాిగమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా బిఆర్ ఎస్ కు బిసిలు మరలకుండా కాంగ్రెస్ తో ఉండేలా , రేవంత్ అండతోనే ఇలా బీసి నేతలు రెడ్లపై రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »