మహిళపై అత్యాచారం, హత్య
సంగారెడ్డి, నిర్దేశం:
సంగారెడ్డి జిల్లా లో దారుణం జరిగింది. సదాశివపేట శంభు లింగేశ్వర ఆలయం వెనకాల మహిళా మృతదేహం లభ్యమయింది. మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికల అనుమానం. వస్త్రాలు లేకుండా, తలపై బండరాయితో కొట్టినట్లు మహిళ మృతదేహం పడివుంది. మహిళను దుండగులు రాత్రి అత్యాచారం, హత్య చేసి పారిపోయినట్లు అనుమానం. స్థానికలు పోలీసులకు, కుటుంబం సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న సదాశివపేట పోలీసులు, క్లూస్ టీం విచారణ ప్రారంభించారు. మృతదేహం నంది కంది గ్రామానికి చెందిన సార లక్ష్మిగా పోలీసులు గుర్తించారు.