కొత్త సీఎస్ గా రామకృష్ణారావు

కొత్త సీఎస్ గా రామకృష్ణారావు

హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావును నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రస్తుత సీఎస్‌ శాంతికుమారి ఏప్రిల్ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దాంతో గత కొన్ని రోజుల నుంచి కసర్తు చేసిన తెలంగాణ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావుకు కీలక బాధ్యతలు అప్పగించింది. రామకృష్ణారావు సహా ఆరుగురు సీనియర్ అధికారుల పేర్లను సీనియారిటీ జాబితా ప్రకారం తెలంగాణ ప్రభుత్వం పరిశీలించింది. చివరగా 1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన కె. రామకృష్ణారావును తదుపరి సీఎస్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనిలో ఆయన సమర్థత, అనుభవం లాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని 2014 నుంచి ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్న రామకృష్ణారావుకు సీఎస్ గా బాధ్యతలు అప్పగించారు. కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో అపారమైన అనుభవం ఉంది. శాంతికుమారి పదవీ విరమణ చేయనున్న క్రమంలో తెలంగాణ సీఎస్‌గా రామకృష్ణారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సోమేష్ కుమార్ తరువాత శాంతికుమారి సీఎస్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సైతం శాంతికుమారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కొనసాగించారు.
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
– ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ సీఈవోగా జయేశ్‌ రంజన్‌
– పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా సంజయ్‌ కుమార్‌
– పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి(హెచ్‌ఎండీఏ వెలుపల)- టీకే శ్రీదేవి
– పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి( హెచ్‌ఎండీఏ పరిధి)- ఇలంబర్తి
– రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ సెక్రటరీ, సీఈవోగా నిఖిల
– ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సంగీత సత్యనారాయణ
– గుడ్‌ గవర్నెన్స్‌ వైఎస్‌ ఛైర్మన్‌గా శశాంక్‌ గోయల్
– ఫైనాన్స్ కమిషన్‌ మెంబర్ సెక్రటరీగా స్మితాసభర్వాల్‌
– కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిశోర్‌
– జెన్‌కో సీఎండీగా ఎస్‌.హరీశ్‌
– జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌
– ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌గా కె. శశాంక
– దేవాదాయశాఖ డైరెక్టర్‌, యాదగిరిగుట్ట ఈవోగా ఎస్‌. వెంకటరావు

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »