రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత..
– ప్రతి పక్షల దాడిని తిప్పి కొట్టలేని పీసీసీ చీఫ్..
– కేసీఆర్ నయం అంటున్న జనం..
– హామిల అమలుకు డబ్బుల ఇబ్బందులు..
– హైడ్రా కూల్చివేతలతో పేదల కన్నీళ్లు..
– రాజకీయంగా లబ్ది పొందాలని పొలిటికల్ పార్టీలు..
– సీఎంలా ఫీలవుతున్న మంత్రులు..
– తీన్మార్ మల్లన్న బీసీ ఎజెండాతో ప్రభుత్వంపై దాడి..
(యాటకర్ల మల్లేష్)
కేసీఆర్ పదేళ్ల పాలన అంతమై ఏడాది కాలేదు.. రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన హామిలు అమలు కాలేవు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామిల అమలుకు ఆర్థిక సమస్యలు అడ్డుగా నిలుస్తున్నాయి. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లీడర్ లు ఎవరికి వారే అక్రమ సంపాదనపై దృష్టి పెట్టారు. రేవంత్ సర్కార్ లో మీకు పనులు కావాలంటే చేసి పెడుతాం.. పిప్టి – పిప్టి అంటూ చాలా మంది ప్రచారం చేసుకుంటున్నారు. ఇక పోతే రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లైన మంత్రులు ఎవరికి వారే సీఎంలా ఫీలవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ ఎజెండాతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి వారే యమున తీరే అనే సందనంగా మారింది.
కేసీఆర్ బెటరనే టాక్..
కేసీఆర్ నియంత పాలనను ప్రజలకు వివరించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ పై పది నెలల్లోనే ప్రజలలో వ్యతిరేకత కనిపిస్తోంది. సామాన్యులకు చేరువ కావడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. రేవంత్ సర్కార్ కంటే కేసీఆర్ బెటరనే టాక్ అప్పుడే వినిపిస్తోంది. మొన్నటి వరకు రాష్ట్రానికి కేసీఆర్ ఒక్కరే సీఎం.. ఆయన మాటనే ఫైనల్.. కానీ.. ఇప్పుడు ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లో ఎక్కువే. సీనియర్ మంత్రులు సైతం ఎవరికి వారే సీఎంలా ఫీలవుతున్నారు. ఉత్తం కుమార్ రెడ్డి కాబోయే సీఎం అంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యనించారంటే పరిస్థితి ఎంత దూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్ష..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్షనే.. కేసీఆర్ లా వాయిస్ పెంచి ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంది. ఆ హామిల అమలుకు నోచుకోక ముందే అభివృది పనుల పేరిట కోట్ల నిధులు కెటాయిస్తున్నారు. ఫోర్త్ సిటీ.. వేల ఎకరాలలో పార్క్.. మెట్రో విస్తరించడం.. ఫార్మా సిటీ గందరగోళం.. లక్షన్నర కోట్లతో మూసి సుందరీకరణ.. కానీ.. ఆర్థిక సమస్యలున్నప్పుడు ఇలాంటి పనులు అవసరమా అనే టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి చుట్టూ మంత్రుల బంధనాలు. చిన్న దానికి పెద్ద దానికి హైకమాండ్ వద్దకు పరుగులు.. వీటికి తోడు పలు అంశాల మీద ప్రభుత్వం తరఫున కౌంటర్ చేసే గొంతు, వ్యవస్థ సీఎం రేవంత్ రెడ్డికి లేకుండా పోయింది
ప్రతి పక్షల దాడిని తిప్పి కొట్టలేని పీసీసీ చీఫ్..
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బీసీ బిడ్డ.. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనుకూలంగా ఉందనే టాక్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సీఎంతో సమానమైన ఆ పదవిని బీసీ బిడ్డకు ఇచ్చింది. కానీ.. ప్రతి పక్షల ఆరోపణలను పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ వాయిస్ సరి పోవడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువే. అయినా.. వాయిస్ ఉన్నోళ్లకే గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకస్తుడిగా ఉండే మహేష్ కుమార్ గౌడ్ కు ఆ పీసీసీ పదవి ఇచ్చారనేది టాక్. పీసీసీ కార్యవర్గం విస్తరణలో మహేశ్ కుమార్ పాత్ర కంటే సీనియర్ కాంగ్రెస్ నాయకుల మాటే వేదంగా ఉంటుందంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ పై బహాటంగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై పీసీసీ చీఫ్ గా నోరుమెదుపక పోవడం కూడా మహేశ్ కుమార్ గౌడ్ మెత్తని మనసుకు నిదర్శనం అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన గౌడ్ నోరు విప్పలేదనే టాక్ వినిపిస్తోంది.
పేదలపై ‘‘హైడ్రా’’ బుల్లోజర్లు..
హైదరాబాద్ నగరంలో చెరువులను కబ్జా చేసి భవనాలను నిర్మాణం చేసిన వారి భరతం పడుతుంటే రేవంత్ రెడ్డి మంచి పని చేస్తుందానే టాక్ ప్రజల్లో ఉండేది. కానీ.. రాను రాను ఆ హైడ్రా రాత్రింబగళ్లు కష్టపడి పని చేసి అనుమతులతో నిర్మాణం చేసుకున్న పేదల ఇళ్లను కూల్చి వేయడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుంది. ముఖ్యంగా పెద్దల భవనాల జోలికి పోవడం లేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ లతో రేవంత్ సర్కార్ పై ప్రజలకు రాంగ్ మెస్సెజ్ పోతుంది. కేటీయార్ జన్వాడ ఫామ్‌హౌజ్ సహా ఒక్కసారి ట్రిపుల్ 111 జీవో పరిధిలో కట్టబడిన వందల నిర్మాణాలు, ఇతర నీటివనరుల ఎఫ్‌టీఎల్ పరిధుల్లో కట్ట బడిన ధనికుల ఆవాసాలు, బహుళ అంతస్థులను వదిలేసి, పేదల ఇళ్లను కూల్చివేస్తున్నతీరు సహజంగానే జనంలో వ్యతిరేకత పెరుగుతుంది.
తీన్మార్ మల్లన్న బీసీ జపం..
తీన్మార్ మల్లన్న అధికార పార్టీ ఎమ్మెల్సీ.. ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంపై బీసీ జపం పేరుతో తిరుగుబాటు జెండా ఎగుర వేస్తున్నారు. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కాలేడని బహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీ జనంకు తాను ఉన్నానని భరోసా కల్పిస్తున్నారు. నామినేటెడ్ పదవులలో రెడ్డిలకే ప్రధాన్యత ఇస్తున్నారనే టాక్ జనంలోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ప్రజాక్షేత్రంలో అగ్రవర్ణాల పెత్తనం ఎన్నెళ్లు అంటూ నిలదీస్తున్న తీన్మార్ మల్లన్న గురించి బీసీ జనం ఆలోచన చేస్తోంది. రెడ్డిల పాలనలో అన్యాయానికి గురయ్యేది బీసీలే అనే టాక్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తీన్మార్ మల్లన్న దూసుకెళుతున్నారు.
ఆగిన ‘‘ఎమ్మెల్యే’’ల వలసలు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటు కాగానే బీఆర్ఎస్ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఇగ గేట్లు తెరిచాం.. బీఆర్ ఎస్ ఖాళీ అంటూ సీఎంతో పాటు మంత్రులు బహాటంగా చెప్పుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేసి బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటారనే టాక్ వినిపించింది. కానీ.. పార్టీ ఫిరాయింపుల కింద కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోర్టు మెట్లు ఎక్కడంతో ఆ వలసలు ఆగి పోయాయి. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందెమోననే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో అనేక అనుమానాలు రేకెత్తడానికి ఆ పార్టీ నేతలే కారణంగా కనిపిస్తోంది.