హైదరాబాద్ లో దమ్ మేరా దమ్

హైదరాబాద్ లో దమ్ మేరా దమ్

హైదరాబాద్, నిర్దేశం:
హైదరాబాద్‌లో పబ్‌లు ఎంత గబ్బో మరోసారి బయటపడింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఆలివ్ బిస్త్రో పబ్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. మాదక ద్రవ్యాలతో దమ్‌ మారో దమ్ జరుగుతోందంటూ పకడ్బందీ సమాచారం రావడంతో ఆలివ్ బిస్త్రో పబ్‌పై పోలీసులు రెయిడ్ చేశారు. 20 మందికి డ్రగ్ పరీక్షలు చేయగా.. ఒకరికి పాజిటివ్‌గా తేలింది హైదరాబాద్ లోని కొన్ని పబ్‌లు అరచకానికి అడ్డాగా మారుతున్నాయి. బయటకేమో ఆయుర్వేదిక్ బార్ అంటారు. లోపల మాత్రం అడ్డగోలు పనులు నడుస్తాయి. ఆయుర్వేదం లేదు ఆరోగ్యం లేదు. డ్రగ్స్ ‌ను అడ్డు అదుపు లేకుండా సరఫరా చేస్తూ ఇల్లీగల్ దందా నడుపుతున్నారు. హైదరాబాద్‌లోని అనేక పబుల్లో, రిసార్టుల్లో గుట్టుగా రేవ్ పార్టీలు సాగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు చాలా పబ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. డ్రగ్స్ వినియోగం, అశ్లీల నృత్యాలతో రేవ్ పార్టీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని తొమ్మిది పైగా పబ్బుల్లో మాదక ద్రవ్యాల విక్రయాలు జోరుగా సాగుతున్నట్టుగా గతంలో పోలీసులే అధికారికంగా ప్రకటించారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.రాష్ట్ర పోలీసులు కొంత కాలంగా డ్రగ్స్ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. పబ్బులు అభివృద్ధికి చిహ్నమా? లేదంటే వెనకబడుతుందా? ఆధునిక సంస్కృతిని, అభివృద్ధిని అందిపుచ్చుకోవడం ఎంత అవసరమో.. అదే సమయంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి అడ్డుకోవడం కూడా అంతే అవసరం. డ్రగ్స్ అమ్మడం, సరఫరా చేయడం, యువతను డ్రగ్స్ బానిసలుగా మార్చడం అంతకంటే వేరే కారణాలు అవసరమా.పబ్బులు ఉంటేనే అభివృద్ది అని భావిస్తే.. అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు. గంజాయి నుంచి కొకైన్ దాకా రోడ్లపైనే అమ్మకాలు, నిత్య గోవాకు ప్రయాణాలు, యూట్యూబ్‌లో చూసి డ్రగ్స్ తయారు చేసి విక్రయాలు, వాటిని మితిమీరి వాడి యువకులు మృతి చెందడం. ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున పబ్బులో డ్రగ్స్ గబ్బు బయటపడింది. అర్ధరాత్రి దాటిన యువతీ యువకులు మత్తులో చిందులేస్తున్న రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఆలివ్ బిస్త్రో పబ్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు రెయిడ్ చేశారు. అందులో కొంత మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »