సీఎం కేసీఆర్ పై మండి పడ్డ బీజేపీ

ప్రధాని తెలంగాణకు వస్తే ప్రోటోకాల్ పాటించడం లేదు

: బీజేపీ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 8, ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించ లేదరి మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి మండిపడ్డారు. మోడీ సభకు జనాలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని అన్నారు. ఇది పార్టీకి సంబందించిన సభ కాదు అధికారిక సభ అని హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ నుండి 11 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు ప్రధాని అని అన్నారు. ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందని అన్నారు. మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థలో పదో స్థానం నుండి ఐదో స్థానానికి చేరుకున్నమని తెలిపారు. మరో మూడు ఏళ్లలో చైనా అమెరికా తర్వాత మూడో అతి పెద్ద దేశంగా భారత్ ఉండ బోతోందని అన్నారు. సింగరేణి నీ బీజేపీ ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయలేరు.. కేసీఆర్ చేశారని అన్నారు. పేపర్ లీకేజీ చేసి మాపై బురద జల్లినట్టు కేసీఆర్ ప్రైవేటీకరణ చేసి బీజేపీ పై బురద జల్లుతున్నాడని ఆరోపించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల యంయంటిఎస్ రెండో దశ పనులు ముందుకు సాగలేదని అన్నారు.ప్రధానికి యంయంటిఎస్ హైదరాబాద్ ప్రజలకు ఎంత అవసరమో బీజేపీ ఎంపిలం వివరంచామని అన్నారు. కేంద్రం సహకారంతో యంయంటిఎస్ రెండో దశ ను ప్రారంభించుకుంటున్నామని తెలిపారు.

బండి సంజయ్ చొరవతో బీజేపీ రాష్ట్ర కార్యాలయ సిబ్బందిని ప్రధానిని కలిసేందుకు అనుమతిచ్చారు. స్వీపర్ సహా ఆఫీస్ లో పనిచేసే 40 మంది సిబ్బంది మోడీ కలవబోతున్నారని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ నెంబర్ 10 వద్ద మోడీతో బీజేపీ సిబ్బంది మీట్‌ అయ్యారు. అనంతరం ఫరేడ్ గ్రౌండ్ చేరుకున్న ప్రధాని మోడీ వేదికపై మాట్లాడుతూ.. ప్రియమయిన సోదర సోదరీమణులారా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందడుగు వేస్తుందని అన్నారు. వందేభారత్ రెండవ ట్రైన్ ప్రారంభించామన్నారు.

భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల నుంచి తిరుమల వెంకటేశ్వరస్వామిని చేరుకునేలా రైలు సర్వీస్ ని అనుసంధానించామన్నారు. 11 వేల కోట్ల ప్రాజెక్టులకు అంకురార్పణ, జాతికి అంకితం చేశామని తెలిపారు. రైల్, రోడ్ కనెక్టివిటీ, హెల్త్ ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!