ట్రంప్‌ తీరుపై సర్వత్రా నిరసనలు

ట్రంప్‌ తీరుపై సర్వత్రా నిరసనలు

దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు
ప్రముఖ ఆర్థికవేత్తల విమర్శలు

వాషింగ్టన్‌, నిర్దేశం:

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలపై విదేశాల్లోనే కాదు. స్వదేశంలోనూ తీవ్రవిమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో పలు నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేసారు. ట్రంప్‌ తీరుతో దేశీయ ఆర్థిక రంగం కుదేలవుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అలాగే ప్రపంచ దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాల ప్రభావంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతోపాటు.. ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని విమర్శలు చెలరేగాయి. భారీగా అసంబద్ధమైన టారిఫ్‌లను విధించి.. ప్రపంచం మొత్తంపై ఆర్థికయుద్ధం ప్రకటించారు. వాణిజ్య భాగస్వామిగా, మార్కెట్‌గా, పెట్టుబడులకు అనుకూలంగా మన దేశంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ముందుకువెళుతున్నారని విమర్శలు వస్తున్నాయి. టారిఫ్‌ల పాలసీ పెట్టుబడులు ఆపేలా, వినియోగదారులు వ్యయాలు నిలిపేసేలా, అమెరికా ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఇవి సాగుతున్నాయని అక్మెన్‌ అభిప్రాయపడ్డారు.ఇవి పెడదారి పట్టకుండా చూసుకోవాల్సి ఉంది. ఆర్థికమాంద్యం ప్రమాదం ఉందని జేపీ మోర్గాన్‌ సీఈవో జెమి డిమోన్‌ తాజాగా అభిప్రాయపడ్డారు. ఆయన వాటాదారులకు విడుదల చేసిన వార్షిక లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

భారత్‌ వంటి దేశాలను తన దారిలోకి తెచ్చుకొనేకంటే.. వాటితో సన్నిహిత సంబంధాలను పెంచుకోవాలని ఆయన సూచించారు. ఇక భారత్‌ వంటి నాన్‌ అలైన్‌ దేశాల విషయంలో అమెరికానే స్నేహహస్తం చాచి సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకోవాలన్నారు. కీలక వాణిజ్య భాగస్వాములతో లోతైన వాణిజ్య సంబంధాలు కలిగి ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరంగా మంచింది. అమెరికా కూటమిలో భాగస్వాములు కాకుండా ఉన్న నాన్‌ అలైన్‌ దేశాలైన భారత్‌, బ్రెజిల్‌ వంటి వాటితో సన్నిహితంగా ఉండాలి. వారికి వాణిజ్యం, పెట్టుబడుల్లో అమెరికా స్నేహహస్తం అందించాలని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో విధించిన టారిఫ్‌లు ద్రవ్యోల్బణాన్ని పెంచొచ్చు. అది ఆర్థికమాంద్యానికి దారితీయడానికి చాలా అవకాశాలున్నాయి. ఆర్థిక వ్యవస్థ చెప్పుకోదగ్గ స్థాయిలో కుదుపులకు లోనవుతుంది. ఇందులో పన్ను సంస్కరణలు, డీరెగ్యులేషన్లకు దారితీయడం సానుకూల అంశాలైతే.. పన్ను, వాణిజ్యయుద్ధం, ఏమాత్రం తగ్గుముఖం పట్టని ద్యవ్రోల్బణం, ఆర్థిక లోటు-, ఆస్తుల విలువల గణనీయంగా పెరగడం, అస్థిరత వంటివి ప్రతికూలాంశాలుగా ఆయన విశ్లేషించారు.

పన్నుల పెంపు వల్ల దిగుమతి చేసుకొనే వస్తువులే కాదు.. దేశీయంగా తయారైన వాటి ధరలు కూడా పెరుగుతాయన్నారు. ఇవి స్వల్పకాలం కనపడతాయి. ముఖ్యంగా దేశీయ ఉత్పత్తుల ఇన్‌పుట్‌ ధరలు, డిమాండ్‌ రెండూ పెరుగుతాయని వెల్లడిరచారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అతిపెద్ద మద్దతుదారుగా నిలిచిన సంపన్నుడు బిల్‌ అక్మెన్‌ కూడా టారిఫ్‌లను తప్పుపట్టారు. ట్రంప్‌ విధానాలు వాణిజ్య భాగస్వామిగా అమెరికాపై మిత్ర దేశాలకు ఉన్న నమ్మకాన్ని ఇవి దెబ్బతీస్తాయన్నారు. దీనికి ట్రంప్‌ కార్యవర్గం టారిఫ్‌లను గణించడానికి ఎంచుకొన్న మార్గం కూడా తప్పని వెల్లడిరచారు. తప్పుడు లెక్కల కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థను కిందకు లాగుతున్నారని మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార దిగ్గజాల విశ్వాసాన్ని ట్రంప్‌ కోల్పోయారు. ఆయన్ను నమ్మిన దేశం, ప్రజలు తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటారు. ఇందుకోసం కాదు ఆయనకు ఓటేసిందని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »