భూ కబ్జాదారులను కాపాడుతూ పేదల కడుపు కొట్టాలని చూస్తారా ఖబర్దార్* సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి

భూ కబ్జాదారులను కాపాడుతూ
పేదల కడుపు కొట్టాలని చూస్తారా ఖబర్దార్*

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి

బద్వేలు, నిర్దేశం:
భూ కబ్జాదారుల ముడుపులకు అమ్ముడుపోయి పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించాలని రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తారా ఖబర్దార్ అంటూ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి రెవిన్యూ అధికారులను హెచ్చరించారు
పేదల ఇల్లు కూల్చి పెద్దలకు కట్టబెట్టాలనే రెవిన్యూ అధికారుల ప్రయత్నాన్ని విరమించుకోవాలని పేదలు వేసుకున్న చోటనే పట్టాలు ఇవ్వాలని రెవిన్యూ అధికారులకు వ్యతిరేకంగా ఏడవ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా  సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్బారెడ్డి దీక్షలో కూర్చున్న బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమ్మానియేల్ కు దండ వేసి దీక్షలను ప్రారంభించి ప్రసంగించడం జరిగింది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
స్మశానానికి కాలనీకి సంబంధమే లేకపోయినప్పటికీ పేదలను ఇక్కడ ఉండనీయకూడదు అన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనతో భూకబ్జాదారులు గ్రామస్తులను రెచ్చగొట్టి కాలనీవాసులకు గ్రామస్తులకు మధ్య గొడవలు సృష్టించారని, వీరికి మద్దతుగా రెవెన్యూ పోలీసు యంత్రాంగం దగ్గర ఉండి కాలనీలో శవాన్ని బూడుస్థాపన చేయడం ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి  ఎక్కడా చూడలేదని వారన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ స్మశానాలను కాపాడుతుందని, ప్రతి గ్రామంలో స్మశానాలను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తున్నదని ఈ విషయం గుర్తించాలన్నారు. భూ కబ్జాదారులు తప్పుడు ప్రచారం చేసినంత మాత్రన అబద్ధం నిజం కాదన్నారు.
భాకరాపేట సిపిఐ కాలనీ చుట్టూ  ఆక్రమణలేనని అవి మీ కంటికి కనపరడలేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు బద్వేల్ పట్టణంలో నియోజకవర్గంలో వందల ఎకరాలు కబ్జాలకు గురైనటువంటి స్థలాలను సర్వే నెంబర్లతో సహా రెవెన్యూ అధికారులకు భారత కమ్యూనిస్టు పార్టీ తెలియజేయడం జరిగిందని ఇప్పటివరకు గత ప్రభుత్వంలో కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ భూములను ఒక్క ఎకరమైన స్వాధీనం చేసుకున్నారా అని ప్రశ్నిస్తున్నాం ,గత ప్రభుత్వంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను రద్దుచేసి స్వాధీరపరచుకొనుటకు మీ పచ్చ ఇంకి పనిచేయడం లేదా ,లేక పచ్చ నోట్లకు అమ్ముడుపోయారా, నిలువ నీడలేని నిరుపేదలు ప్రభుత్వ భూమి రెండు సెంట్లు ఆక్రమించి చిన్నపాటి ఇల్లు కట్టుకొని ఎలాంటి మౌలిక వసతులు లేకపోయినప్పటికీ కాపురాలు చేస్తుంటే వారికి మౌలిక వసతులు కల్పించకపోవడంతో పాటు వారి ఇళ్ళను కూల్చాలని చూస్తారా ఖబర్దార్ రెవెన్యూ అధికారుల రా ,భాకరాపేట సిపిఐ కాలనీ లో నివసిస్తున్న పేద ప్రజల జోలికి వస్తే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మలుస్తామని సిపిఐ గా హెచ్చరిక జారీ చేస్తున్నాం
ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం మానుకొని, ఎకరాలకు ఎకరాలు ఆక్రమించుకుని కోట్లు సొమ్ము చేసుకుంటున్న కబ్జా రాయుళ్లను అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేయాలని ,వారు ఆక్రమించుకొని కోట్లు సమ్మేసుకున్నటువంటి ప్రభుత్వ భూమి స్వాధీన పరచుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే పేద ప్రజలు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ పట్టాలు మంజూరు చేసి పక్కా గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేనిపక్షంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని వారు తెలిపారు.
ఈ దీక్షలకు మద్దతు  తెలిపిన దళిత వేదిక జాతీయ నాయకులు రెడ్డన్న రాష్ట్ర నాయకులు నారాయణ మాట్లాడుతూ కాలనీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని వీటిని అరికట్టడంలో పోలీస్ రెవెన్యూ యంత్రాంగం విఫలమన్నారు మీ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ పోరాటానికి మద్దతుగా నిలుస్తామని వారు తెలిపారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »