హోటల్ లో బాంబు బెదిరింపు కాల్
పరుగులు పెట్టిన పోలీసులు
సికింద్రాబాద్, నిర్దేశం:
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక్ హోటల్ లో బాంబు పెట్టినట్లు ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్ కాల్ అందరినీ పరుగులు పెట్టించింది. కంట్రోల్ రూమ్ నుండి సమాచారం రావడంతో గోపాలపురం పోలీసులు బాంబు, డాగ్ స్క్వాడ్ సహాయంతో హోటల్లో తనఖిలు నిర్వహించారు. హోటల్లో ఉన్న కస్టమర్లను వెంటనే బయటకు పంపి తనిఖీలు చేయగా బాంబు లేదని తేల్చారు. తనిఖీల అనంతరం నకిలీ ఫోన్ కాల్ గా గుర్తించారు.. మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో కరీంనగర్లో కూడా ఇదే మాదిరిగా బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.