బిహారీ దొంగలను అరెస్టు చేసిన పోలీసులు.
నిజామాబాద్, నిర్దేశం:
కోత్తపేట్ గ్రామ శివారులో అర్ధరాత్రి దారిదోపిడికి పాల్పడిన ముగ్గురు దొంగలను నిజామాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.
నిజామాబాద్ సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎడపల్లి మండలం కుర్నపల్లికి చెందిన ఫొటోగ్రాఫర్ గితేష్ బుధవారం రాత్రి బైక్పై ఇంటికి వెళ్తుండగా, ముగ్గురు దుండగులు దాడి చేసి నగదు, మొబైల్ ఫోన్ దోచుకున్నారని తెలిపారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, కోత్తపేట్ శివారులోని శ్రీ గంగా రైస్ మిల్ వద్ద పని చేసే బిహార్ వాసులు కుందన్, విజయ్, సుందర్లను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.
24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ సురేష్ తెలిపారు. ఈ కేసు ఛేదనలో రూరల్ ఎస్ఐ అరీఫ్, పోలీసు సిబ్బంది కృషిని ఆయన అభినందించారు.