ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేస్తారనేదానికి చెక్ పడేట్టుగానే కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజారిటీ రాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఎన్డీయే మిత్రపక్షాలు సహా బీజేపీలోని సొంత నేతలు కూడా మోదీ ప్రధానిగా ఉండడంపై అసంతృప్తితో ఉన్నట్లు పలుమార్లు వ్యక్తమైంది.రెండు సార్లు బీజేపీ మేజిక్ మార్క్ సీట్లు సాధించడంతో ఎన్డీయే పార్టీలు మౌనంగా ఉండిపోయాయి. కానీ, ఈసారి బీజేపీ 240 సీట్ల వద్దే ఆగిపోవడంతో తమ అసంతృప్తిని వ్యక్తపరిచే అవకాశం వచ్చింది.
గతంలో ఎల్.కే అద్వాణీని ప్రధాని కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. దాంతో ప్రధాని అవకాశం అటల్ బిహారీ వాజిపేయికి దక్కింది. ఇక ఈసారి కూడా ఈ విషయంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించనున్నారు. మోదీ గుజరాత్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు మోదీ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.
గడ్కరి ఆర్ఎస్ఎస్ కు అతి సమీప వ్యక్తి. మోదీ తర్వాత బీజేపీలో ప్రధాని రేసులో ఉన్న ప్రముఖ వ్యక్తి. వాస్తవానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుంటే ఎన్డీయే ప్రధానిగా అభ్యర్థిగా గడ్కరిని ప్రతిపాదించేందుకు పార్టీ సిద్ధమైంది. అయితే ఆ టైంలో 303 సీట్లు రావడంతో మోదీకి లైన్ క్లియర్ అయింది. అయితే ఈసారి సీట్లు తగ్గడంతో గడ్కరీకి అవకాశం రానున్నట్లు చర్చ సాగుతోంది.