Take a fresh look at your lifestyle.

పాపం కేసీఆర్

0 11

పాపం కేసీఆర్
– గారాల బిడ్డ జైలులో..
– ప్రతిపక్ష హోదాతో మానసిక వేదన
– కాళేశ్వర్ ప్రాజెక్ట్ విచారణతో తలనొప్పులు
– కేసీఆర్ ఫ్యామిలీని వెంటాడుతున్న ఫోన్ ట్యాపింగ్
– కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా రేవంత్ స్పీడ్..

(యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్ )
పాపం కేసీఆర్.. మారిన పరిస్థితులలో కేసీఆర్ ఫ్యామిలీకి అన్నీ కష్టాలే.. తప్పులు చేసేటోళ్లే అందరూ.. కానీ.. దొరికినోళ్లే దొంగలు… ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ మానసిక వేదనకు ముద్దుల కూతురు కవిత ఢిల్లీ జైలులో చిప్ప కూడు తినడమే. పదేళ్లు అధికార హోదాను అనుభవించిన ఆ ఫ్యామిలీకి చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నారు.

కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అందరి నోటా వినిపించిన మాట.. కానీ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ పరిస్థితి తారుమారైంది. ‘ఎక్కడున్నావురా శని అంటే.. నీ వెంటే ఉన్నాను పని..’’ అందట. ఇగో.. ఇప్పుడు కేసీఆర్ ఏది చేసినా ఆ శని వెంటాడుతున్నట్లుంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.
ప్రజలు కేసీఆర్ కు ప్రతి పక్ష హోదా ఇచ్చారు. అవమానంగా ఫీలయ్యాడో ఏమో ఇప్పటి వరకు అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. ఫాంహౌజ్ లో కేసీఆర్ పడి పోవడంతో తుంటి వెముక విరిగింది. కాళేశ్వర్ ప్రాజెక్ట్ విచారణ.. ఫోన్ ట్యాపింగ్.. సెక్రటియెట్ భవన నిర్మాణంలో అవకతవకాలు.. ఇవన్నీ ఒక ఎత్తైతే.. కన్న కూతురు కవిత అరెస్టు కేసీఆర్ కు జీర్ణించుకోలేని దెబ్బ.

కవిత అరెస్టుపై ప్రజలలో స్పందన కరువు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ ముద్దుల కూతురు కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడామె జైలులో ఉంటుంది. కానీ.. ఆమెను అరెస్టు చేసిన సందర్భంలో ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. బీఆర్ ఎస్ శ్రేణులు సైతం పెద్దగా ఆందోళనలు చేయలేరు. ప్రేక్షక పాత్రను పోషించారు. అక్కడక్కడా కొందరు కార్యకర్తలు స్పందించినా ఒకప్పటి ఉద్యమ వేడి కనిపించలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ పిలుపిస్తే ప్రజలు రాజకీయాలకు అతీతంగా రోడ్డెక్కేవారు. కానీ.. మారిన పరిస్థితులలో కవిత అరెస్టుపై కన్న తండ్రి కేసీఆర్ స్పందించక పోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.

అప్పట్లో కవితకు అండగా ప్రభుత్వం తరలింది.

అప్పట్లో ఇదే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారుల ముందు విచారణకు వెళ్లిన కవితకు అండగా ప్రభుత్వమే ఢిల్లీ తరలి వెళ్లింది. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి.. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ.. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టును ప్రజలు పట్టించుకోక పోవడానికి కారణం..? ఒడిచిన ముచ్చటగా భావించడమే.. టీవీ సీరియల్స్ ను మరిపించే విధంగా కవిత కేసు కొనసాగడమే.. మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా కథనాలు వచ్చినా… ఇంతకాలం కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయారనే భావన ఉండేది.

కవిత ఒవరాక్షన్..

ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవిత ప్రజల ఆలోచనను మరల్చడానికి సమస్యలపై స్పందిస్తారనే టాక్ ఉంది. అసేంబ్లీలో పూలే విగ్రహం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ డిమాండ్.. మంత్రి వర్గంలో బీసీల సంఖ్య పెంచాలి.. ఇగో ఇలాంటి డిమాండ్లతో ఆందోళన చేసిన కవితకు ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. కారణం.. మొన్నటి వరకు అధికారంలో ఉండి పట్టించుకొనిది కేసీఆర్ అనే టాక్ పరోక్షంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కవిత సక్సెస్ అయ్యారు.
కేసీఆర్ కూతురుగా ప్రత్యేక అధికారాలను అనుభవించిన కవిత చివరకు ఢిల్లీ లిక్కర్ కేసులో అడ్డంగా దొరికి పోవడంతో ఆ ఫ్యామిలీకి డౌన్ ఫాల్ మొదలైంది అంటున్నారు ప్రజలు.

Leave A Reply

Your email address will not be published.

Breaking