భర్తపై పెట్రోల్ దాడి..తీవ్రగాయాలు
నిర్దేశం, జగిత్యాలః
జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో దారుణం జరిగింది. భర్త పడాల కమలాకర్ పై మొదటి భార్య, పిల్లలు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయలపాలైన కమలాకర్ ను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు భార్యలు ఉండగా కమలాకర్ మరో మహిళను పెళ్ళి చేసుకున్నాడు. మద్యం మత్తులో భార్య పిల్లలను కొట్టడంతో మొదటి భార్య పిల్లలు తిరుగబడ్డారు. కమలాకర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.