కులగణన( రీ )సర్వేలో పాల్గొని-సమాజ భవిష్యత్తు నిర్మాణం చేద్దాం

కులగణన( రీ )సర్వేలో పాల్గొని-సమాజ భవిష్యత్తు నిర్మాణం చేద్దాం
కులగణన భవిష్యత్ తరాలకు దిక్సూచి…మంత్రి పొన్నం
హైదరాబాద్, నిర్దేశం:
*జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లోని మినిస్టర్ కోటర్స్ లో కులగణనపై అవగాహనకు సంబంధించిన టీ షర్ట్ లను లాంఛ్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ గొప్ప పనికి శ్రీకారం చుట్టిన జాతీయ బీసీ దళ్, దుండ్ర కుమారస్వామిపై ప్రశంసలు కురిపించారు మంత్రి పొన్నం ప్రభాకర్.
కులగణనకు సంబంధించి ఇంటింటి (రి)సర్వే లో పాల్గొనాలని ప్రజలను చైతన్య పరుస్తోంది జాతీయ బీసీ దళ్. ఇంతకు ముందు ఇంటింటి సర్వేలో పాల్గొనని వారి కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రీ సర్వే ను ప్రారంభించింది. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. ఇంతకు ముందు నిర్వహించిన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 3.1 శాతం మంది వివరాలు నమోదు చేసుకోలేదు.  వారికోసం ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది.  టోల్ ఫ్రీ నెంబర్ 04021111111 కూడా ఏర్పాటు చేసింది. ఆన్లైన్ ద్వారా లేదా మండల కార్యాలయంలో కూడా వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది.
Ponnam Prabhakar
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. టీ షర్ట్స్ ద్వారా అవగాహన కల్పించాలని జాతీయ బీసీ దళ్ చేసిన ప్రయత్నం చాలా గొప్పది. ప్రజలలో మరింత అవగాహన కోసం లాభాపేక్ష లేకుండా జాతీయ బీసీ దళ్ చేస్తున్న ప్రయత్నాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మేధావులు బీసీ వర్గాల నాయకులు అందరి విజ్ఞప్తి మేరకు కుల గణనలో నమోదు చేసుకొని వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇప్పటి వరకు కుల సర్వే లో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలని.. మూడు పద్ధతుల్లో కుల సర్వే లో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగిందని, దయచేసి తెలంగాణ సమాజంలో కుల గణన సర్వేలో నమోదు చేసుకోని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. కులగణన భవిష్యత్ తరాలకు దిక్సూచిగా మారుతుందని అన్నారు. తెలంగాణలో కులగణన ఓ చారిత్రాత్మక నిర్ణయం. రాహుల్ గాంధీ కులగణన అంశానికి దేశవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్. తెలంగాణ కుల గణనను విజయవంతంగా పూర్తి చేసి వెనుకబడిన తరగతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు న్యాయం చేశారు. కుల గణనలో బీసీ జనాభా లెక్కలు తీసుకుని వస్తామని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్గాంధీ హామీని రేవంత్రెడ్డి నెరవేర్చారని, అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »