యుద్ధానికి పాకిస్తాన్ సైన్యం సిద్ధం
సైన్యంను అలార్ట్ చేసిన ప్రధాని షాబాజ్ షరీఫ్
– ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న ప్రతికారమేనా..?
నిర్దేశం, పాకిస్తాన్ :
పహల్గామ్ దాడి చేసిన పాకిస్థాన్‌లో పశ్చాత్తాపం కనిపించడం లేదు. భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిగా దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఓవైపు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నా, రూపాయి అప్పు పుట్టే పరిస్థితి లేకపోయినా పట్టించుకోవడం లేదు. రేపటి దేశంలో జరిగే అనార్థాల గురించి ఆలోచించండం లేదు. భారత్‌పై ప్రతీకారంతో రగిలిపోతోంది. అందులో భాగంగా చర్యలకు సిద్ధపడింది. సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడం అంటే యుద్ధం ప్రకటించినట్టేనని పాక్ భావిస్తోంది. అందుకు తమ నుంచి కూడా దూకుడుగానే సమాధానం వస్తుందని చెబుతోంది. సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వారికి ఉన్న సెలవులును రద్దు చేసినట్టు మీడియా కథనాలు వినిపిస్తున్నాయి. ఎలాంటి చర్యలకైనా సైన్యం సిద్ధంగా ఉండాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని సైన్యం చెబుతోంది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం (22 ఏప్రిల్ 2025) జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని రద్దు సహా భారతదేశం అనేక చర్యలు తీసుకుంది. ఇది పాకిస్తాన్‌పై ప్రభావితమైంది. దీనికి ప్రతిగా భారతదేశానికి వాణిజ్య విమానాలు వచ్చేందుకు వీలు లేకుండా పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసింది. భారత విమానాలు ఇకపై పాకిస్తాన్ గగన స్థలంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని, దౌత్య సంబంధాలను తగ్గించాలని భారతదేశం తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ కలవరపాటుకు గురైంది. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ గురువారం (ఏప్రిల్ 24, 2025) ఉన్నత స్థాయి భద్రతా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ బుధవారం రాత్రి ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ, భారతదేశం తీసుకున్న చర్యను తొందరపాటు నిర్ణయంగా అభివర్ణించారు. పహల్గామ్ దాడి తర్వాత జెడ్డా నుంచి వెంటనే తిరిగి వస్తున్నప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానం పాకిస్తాన్ గగనతలం గుండా వెళ్ళలేదు. మరొక మార్గాన్ని ఎంచుకున్నారు అని అన్నారు.