Take a fresh look at your lifestyle.

తెలంగాణలో ప్యాకేజీ,లీకేజీ ప్రభుత్వం నడుస్తుంది

0 89

తెలంగాణలో ప్యాకేజీ,లీకేజీ ప్రభుత్వం నడుస్తుంది.
కెటిఆర్ కమీషన్ పిఆర్వోనా లేక సిట్ ధర్యాప్తు మెంబర్లా?
దమ్ముంటే పాసైన అభ్యర్థుల వివరాలు, కటాఫ్ మార్కులు ప్రకటించాలి.

: BSP రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 3 (వైడ్ న్యూస్) తెలంగాణలో ఒక పక్క పేపర్ లీకేజీలు మరో పక్క లిక్కర్ ప్యాకేజీల ప్రభుత్వం నడుస్తుందని డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఈ రోజు వికారాబాద్ లో పదవ తరగతి పేపర్ కూడా లీకైందని ఆరోపించారు. కెటిఆర్ ఏ అధికారంతో పేపర్ లీకేజీ అంశంపై ప్రెస్ మీట్ పెడుతారు? ఆయన ఏమైనా కమీషన్ పిఆర్వోనా లేక సిట్ అధికారుల బాధ్యుడా అని ఎద్దేవా చేశారు.

దమ్ముంటే కెటిఆర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పాసైన అభ్యర్థుల వివరాలు, మార్కులు, కటాఫ్ మార్కుల వివరాలు ప్రకటించేలా చూడాలని కోరారు ప్రవీణ్ కుమార్. ఈ రోజే పేపర్ లీకేజీపై సిబిఐ విచారణ జరపాలని, బోర్డు చైర్మెన్ మరియు సభ్యులను తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశామని తెలిపారు. సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వం వెంటనే లీకేజీ బాధ్యులను తొలగిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

కేసిఆర్ ప్రధాన మంత్రి కంటే ఎక్కువ నెలకు 4.25 లక్షల జీతం తీసుకుంటూ 30 లక్షల మంది నిరుద్యోగ యువత గురించి ఒక్క మాట మాట్లాడడం లేదని విమర్శించారు ప్రవీణ్ కుమార్. మహారాష్ట్రకు వెళ్లడానికి మరియు పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యే సమయం ఉంది కానీ రాష్ట్ర సమస్యలపై మాట్లాడే సమయం సీఎంకు లేదా అని ప్రశ్నించారు ఆయన. అసలైన దొంగలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు.అందుకే సిబిఐ విచారణ మరియు ఈడీ విచారణ జరపాలని ఆరోపించారు.న్యూజిలాండ్ దేశానికి కూడా పేపర్లు వెళ్లాయని మనీలాండరింగ్ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

కాకతీయ విద్యార్థులు లేకపోతే దయాకర్ రావు, రాజేశ్వర్ రెడ్డి, వినయ్ భాస్కర్ లకు పదవులు ఎక్కడివని, ఇపుడు విద్యార్థి ఉద్యమాలు ఎలా అణిచివేస్తారని మండిపడ్డారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. విద్యను వ్యాపారంగా చేసి అమ్ముకునే పల్లా రాజేశ్వర్ రెడ్డికి విద్యార్థుల గురించి మాట్లాడే కనీస అర్హత లేదన్నారు.

నూతన బోర్డు ఏర్పాటు చేయకుండా మళ్లీ పరీక్షలు నిరవహించకూడదని లేని పక్షంలో కమీషన్ ఆఫీసు, ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు ప్రవీణ్ కుమార్. ఎన్.పి.డి.సి.ఎల్ లో జూనియర్ లైన్ మెన్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేస్తున్న ధర్నా కార్యక్రమానికి మద్దతు పలికారు. వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వకపోతే స్వయంగా నేనే ధర్నాకు కూర్చుంటానని పేర్కొన్నారు.

ఎస్.పి.డి.సి.ఎల్ నియామకాలు రెండు సార్లు జరిపిన జగదీశ్వర్ రెడ్డి ఎన్.పి.డి.సి.ఎల్ పై ఎందుకు వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు . 2503 పోస్టులకు వారం రోజుల్లోగా నియామకాలు జరపాలని లేదంటే బిఎస్పి ఆధ్వర్యంలో ఆఫీసు ముట్టడిస్తామని అల్టిమేటం జారీ చేశారు ప్రవీణ్ కుమార్. ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణకు విద్యార్థులు చేసే ప్రతి పోరాటానికి బిఎస్పి తోడుగా ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో ర్రాష్ట కో ఆర్డినేటర్ వెంకటేష్ చౌహాన్,రాష్ట్ర కార్యదర్శి మాదారపు రవి,హన్మకొండ జిల్లా అధ్యక్షులు శనిగరపు రాజు,వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద శ్యాం,మహిళా నాయకురాలు దాసరి ఉష,రజిత,కన్నం సునీల్ తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking