“ఒక్క నిమిషం ఆలస్యం”
నిబంధన ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టే దమ్ముందా..?
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించలేరు. కష్టపడి చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితులు ఉన్నా నేటి కాలంలో ఈ ‘ ఒక్క నిమిషం ఆలస్యం..’ నిబంధన పెట్టిన పెద్దలు ఏమి సాధిస్తుండ్రో అర్థం కాని ప్రశ్న. ఆ ఎగ్జామ్ కు టైమ్ కు వెళ్లాలని అందరికి ఉంటుంది. కానీ.. ఆ ఆలస్యంకు ఆ విద్యార్థితో పాటు ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
“ఒక్క నిమిషం ఆలస్యం” నిబంధన వల్ల ఇంటర్ విద్యార్థి అవమానంతో తల్లిదండ్రులకు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడంటే అతను ఎంత మానసిక వేదనకు గురయ్యాడో అర్థం చేసుకునే వారేరి. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఈ నిబంధనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిండం మూర్ఖత్వమే.
“ఒక్క నిమిషం ఆలస్యం” ఆలస్యమైతే పరీక్ష రాయించని అధికారులు విధులకు ఒక్క నిమిషం ఆలస్యమైతే వారి ఉద్యోగాన్ని తొలగించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా..? ఇప్పటికైనా అన్ని తెలిసినా ఉద్యోగులకు ఇక ముందు ఈ నిబంధన పెట్టగలరా..?
ఆర్థికంగా డబ్బున్నోడు కారులలో ఎగ్జామ్ కు వెళ్లి తమ పిల్లలను దింపేస్తారు. అదే పేదోడు ఆర్టీసీ బస్సు కోసం నిరిక్షించాల్సిందే. టైమ్ బస్సు రాకుంటే ఎలా అంటే..? ముందుగానే బయలు దేరాలని ఉచిత సలహాలు ఇచ్చే మూర్ఖం పెద్దలు చాలానే ఉన్నారు. అయినా.. అరగంట ఆలస్యంగా ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లితే జరిగే నష్టం ఆ విద్యార్థికే.. మిగతా టైమ్ లో ఆ విద్యార్థి రాస్తే పాస్ మార్కులు రావచ్చు. చదివినొళ్లందరికి సర్కార్ కొలువులు ఇవ్వని ఈ ప్రభుత్వం పిచ్చి నిబంధనలు పెట్టి ప్రాణాలు తీసే అధికారం ఎవరిచ్చారు..?
ఒకవేళ విద్యార్థులకు పెట్టిన నిబంధనలాగా టైమ్ కు విధులు నిర్వహించని ఉద్యోగులకు ఇలాగే పెట్టాలని కోరుతున్నారు అభ్యుదయ వాదులు.
– సోషల్ మీడియా సౌజన్యంతో..