పాస్ పోర్ట్ బ్రోకర్ పాలనలో ఒకరు లిక్కర్ క్వీన్… ఇంకోకరు లీకేజీ కింగ్.

బీజేపీ అధికారంలోకి రాగానే – 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం

కేసీఆర్ ఫ్రభుత్వంపై ఆశ పెట్టుకోవద్దు… ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదు

: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్

హైదరాబాద్, మార్చి 26=5 : ‘‘కేసీఆర్ పాలనలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమైంది. ఇగ ఉద్యోగాలొస్తాయనే ఆశ పెట్టుకోవద్దు… మేమున్నాం…మీరేం భయపడకండి. బీజేపీ అధికారంలోకి రాగానే….. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. యూపీఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం. డీఎస్సీ-2008 బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు.

బీజేపీ ఈరోజు ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన నిరుద్యోగ మహాధర్నా ముగింపు సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి ‘‘తెలంగాణ ఉద్యమకారులారా…. ఇంకెన్నాళ్లీ మౌనం? ఏమైంది ఆనాటి ఉద్యమ స్పూర్తి? కేసీఆర్ కేసులు పెడతారని భయపడుతున్నారా? 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల నాశనమవుతున్నా స్పందించరా?. రండి మీకు అండగా మేమున్నాం. మీకు బాధవస్తే మా భుజాన వేసుకుంటాం… నిరుద్యోగుల తరపున రొడ్డెక్కి కొట్లాడదాం.. గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేద్దాం రండి’’అంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు……

• బీజేపీ నిరుద్యోగ మహాధర్నాకు విచ్చేసిన నిరుద్యోగులకు, విద్యార్థి జేఏసీ నాయకులకు, డీఎస్సీ-2008 బాధితులకు, పార్టీ కార్యకర్తలకు అభినందనలు.

• 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన బీజేవైఎం నాయకులను జైళ్లో వేశారు. అక్కడ ఇష్టానుసారం వేధిస్తున్నారు.. జైళ్ల డీజీ ఖబడ్దార్….వచ్చేది మా ప్రభుత్వమే.. నీకు చిప్పకూడు తిన్పిస్తాం…

• సిగ్గుండాలే… ప్రభుత్వ ఉద్యోగిగా జీతం తీసుకుంటూ… ధర్మం కోసం, నిరుద్యోగుల పక్షాన జైలుకొచ్చిన వాళ్లను వేధిస్తారా? బూతులు తిట్టిస్తారా? రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని బెదిరిస్తారా? ఇది న్యాయమేనా అని మీ కుటుంబ సభ్యులను అడగండి…

• పాస్ పోర్ట్ బ్రోకర్ పాలనలో ఒకరు లిక్కర్ క్వీన్… ఇంకోకరు లీకేజీ కింగ్…

• నిరుద్యోగులు డబ్బుల్లేక మధ్యాహ్నం లంచ్ చేయరు… అన్నీ కలిపి సాయంత్రం 4 గంటలకు భోజనం చేస్తున్నారు. వయసు మీదపడ్డా ఉద్యోగాలు రాక గడ్డాలు పెంచుకుంటూ చదువుకుంటున్నారు. కుటుంబాలకు భారమైనరు.

• కేసీఆర్ ఫ్రభుత్వంపై ఆశ పెట్టుకోవద్దు… ఉద్యోగాలివ్వదు… నిరుద్యోగులను మోసం చేసేందుకు నోటిఫికేషన్లు ఇస్తారు.. లీకేజీలతో జాప్యం చేస్తూనే ఉంటారు.

• ప్రశ్నించిన మాకు నోటీసులిస్తున్నారు. మరి కేటీఆర్ కు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు? ఇద్దరికే లీకేజీ సంబంధం ఉందని చెబితే.. ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారు… ఏ హోదాతో కేసీఆర్ కొడుకు చెప్పారో నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదు? సిట్ కు ఆ ధైర్యం లేదా?

• అనేక కేసుల్లో వేసిన సిట్ నివేదికలేమయ్యాయి. నయీం డైరీ ఆస్తులెటు పోయినయ్… ఆయన భూములను ఆక్రమించుకున్నదెవరు? డ్రగ్స్, మియాపూర్ భూముల కేసులేమైనయ్… ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య కేసు ఏమైంది?

• లీకేజీకి సహకరించిన వారిపై విచారణ జరపాలి. కేసీఆర్ కొడుకు పాత్ర ఉంది. ఆయనకూ నోటీసులివ్వాల్సిందే…

• లీకేజీకి ఇద్దరు, ముగ్గురికే పరిమితం కాలేదు.. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను ఎందుకు తొలగించడం లేదు? తొలగిస్తే వాళ్లు బయటకొచ్చి వాస్తవాలు బయటపెడతారనే భయంతోనే వారిపై చర్యల్లేవు.

• 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేసిన లీకేజీపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు? తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి భయమెందుకు?

• ఆస్తులమ్ముకుని, అప్పు చేసి, తాళిబొట్టు కుదవపెట్టుకుని కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులు లీకేజీతో నష్టపోయారు. వాళ్లకు రూ.లక్ష పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు?

• ఏ శాఖలో తప్పులు జరిగినా కేసీఆర్ కొడుకే స్పందిస్తున్నాడు? ఆయన షాడో సీఎం. లీకేజీ అయితే మాత్రం నాకే సంబంధం లేదంటున్నడు… తప్పు చేయకపోయినా మంత్రులను బయటకు పంపిన కేసీఆర్ కొడుకు తప్పు చేస్తే ఎందకు బర్తరఫ్ చేయడు?

• దొంగ సారా దందా చేసి దొరికన బిడ్డను, లీకు వీరుడు కొడుకును కాపాడుకునేందుకు యత్నిస్తున్న కేసీఆర్ నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోవడం లేదు? సీఎం నిర్వాకంవల్ల నిరుద్యోగులు బతుకులు బర్బాద్ అయ్యాయి.

• నిరుద్యోగులారా మీరేం భయపడకండి. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే… రాగానే డీఎస్సీ-2008 బాధితుల సమస్యను పరిష్కరిస్తాం…

• 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డెక్కి కాషాయ జెండా పట్టుకుని గండ్రించే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ను తరిమికొట్టి గొల్ల కొండ కోటపై కాషాయ జెండా ఎగరవేస్తాం.

• బీజేపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం… యూపీఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాం.

• తెలంగాణ ఉద్యమకారులారా… ప్రజలారా… కేసీఆర్ సర్కార్ ను తెలంగాణ పొలిమేరల్లో తరిమి తరిమికొట్టేందుకు బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాలని కోరుతున్నా… మీకు ఏ బాధ వచ్చినా బీజేపీ భుజస్కందాలపై వేసుకుని కొట్లాడతాం…

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!