Take a fresh look at your lifestyle.

0 20

ఓల్డ్ ఏజ్ హోమ్..

ఏవండీ…మీకీ సంగతి తెలుసా…? మన పక్క ఫ్లాట్ లో ఉండే కరుణాకర్ గారూ, వసుంధర గారూ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లిపోతున్నారట…
వాళ్ళుండే ఫ్లాట్ అద్దెకి ఇస్తారట ప్రస్తుతం అంది భర్త తో ప్రభావతి.
అవునా… నీకెలా తెలుసు.. నీకు చెప్పారా..? అన్నారు ప్రభావతి భర్త ముకుంద రావు గారు..
ఈ విషయం మన పనిమనిషి చెప్పింది అందామె.
“పోనీలే పాపం, అక్కడ ఉంటే మంచి కాలక్షేపం,
కనిపెట్టుకుని చూసే వాళ్ళు ఉంటారు… సేఫ్టీ కూడా అన్నారు” ముకుందం గారు.
‘‘ఏంటో… ఖర్మ కాకపోతే, ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని దిక్కులేనట్టు… అక్కడ ఉండటం ఏంటో..అంది” ఆవిడ దీర్ఘం తీస్తూ…
“చూడు.. నువ్వు అలా మాట్లాడటం తప్పు…
ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు బ్రతుకుతారు అంతే గానీ ఇలానే బ్రతకాలి అని ఒక రూల్ పెట్టుకుని అందరం బ్రతకడం కష్టం… ఆ రూల్ ఎంత సహేతుకమైనా…
మనం విమర్శించడం మానేస్తే మంచిది”… అన్నారు ముకుందం గారు…
“సరే లెండి ఏదో పక్క వాళ్ళు చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు కాబట్టి మాట్లాడుకోవడం అంతే… నాకెందుకు…?
సాయంత్రం వంట పని చూసుకోవాలి అంది ఆవిడ తనలో తను మాట్లాడుకున్నట్లుగా పైకే..
ఆవిడ కొడుకూ కోడలు ఉద్యోగాలనుండి రాత్రి 7 దాటాక వస్తారు… ఈవిడే వాళ్ళొచ్చే టైంకి వంట చేసి పెట్టాలి…. కోడలు చిన్న సాయం కూడా చేయదు… మనవలిద్దరినీ వీళ్లే చూసుకోవాలి.. ఒకడు స్కూల్ కి వెళ్తాడు… రెండో వాడు రెండేళ్ల వాడు….
ఈవిడ ఓపిక లేక, పిల్లల్ని చూసుకోలేక… పని చేయలేకుండా ఉంటుంది…
‘ఆవిడకి పక్కవాళ్ళ మీద అసూయ….చక్కగా ఇద్దరే ఉంటారు లింగు లిటుకు అంటూ… పనేమీ ఉండదు ఆవిడకి అంతా రెస్ట్ అని ఆవిడ భావన’…
కొన్ని రోజులకే అందరికీ తెలిసింది… కరుణాకర్ గారి విషయం…
ఫ్లాట్స్ లో ఉన్న అసోసియేషన్ వాళ్ళ ఫంక్షన్ హాల్ లోనే ఆయనకి చిన్న సెండ్ ఆఫ్ పార్టీ ఏర్పాటు చేశారు.
ఆ రోజు సాయంత్రం అందరూ వచ్చారు… చాలా మంది మాట్లాడారు…
కరుణాకర్ గురించి ఆయన భార్య గురించి… వాళ్ళు ఎంత మంచి వాళ్ళో… ఎంత హుందాగా ఉండేవారో… అని..
కొంతమంది సానుభూతిగా మాట్లాడారు…
పిల్లలుండీ ఈ పరిస్థితి రావడం మీద…ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోవడం లేదని..
ఇలాంటి తల్లి తండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపించడం బాధాకరమని…
ఇలా అనేక రకాలుగా…
కొంతమంది కి మాట్లాడే అవకాశం వచ్చినా…చేతికి మైకు ఇచ్చినా పట్టలేము…
అందరూ కరుణాకర్ గారి జంట వంక సానుభూతి తో చూస్తున్నారు…
చివరిగా కరుణాకర్ గారి వంతు వచ్చింది…
ఆయన మాట్లాడేస్తే.. అందరూ భోజనాలు చేసేసి వెళ్లిపోవచ్చని ఆత్రుత అందరిదీ…
ఆయన లేచి స్టేజి మీదకి వెళ్లి మైకు తీసుకున్నారు…
మాట్లాడటం ప్రారంభించారు.
అందరికీ కృతజ్ఞతలు… మా మీద చాలా సానుభూతి చూపించారు..
మా లైఫ్ కూడా మీ అందరి సాన్నిధ్యంలో చాలా బాగా గడిచింది… నేను ఒక్క అయిదు నిమిషాలు మాట్లాడతాను… దయచేసి వినండి..

మాకు ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరికీ రెండేళ్ల తేడా…
మేము ఇద్దరం కూడా ఉద్యోగస్థులం…

పిల్లల్ని మంచి స్కూల్ లోనే చదివించాం… ఆ రోజుల్లో అందరూ నడిచిన దారిలోనే నడిచాం… పిల్లల పదో తరగతి అవగానే ఒక కార్పొరేట్ కాలేజ్ లో ఎం.పి.సి గ్రూప్ లో జాయిన్ చేయడం… దానితో పాట ఎంసెట్ కోచింగ్ ఇప్పించాం.
డబ్బుకు చూసుకోలేదు…
పిల్లలకి దీని మీద ఆసక్తి ఉందా లేదా అని అడగలేదు…
ఒకటే ధ్యేయం…
ప్రస్తుత ట్రెండ్ ని ఫాలో అవ్వాలి అంతే…
మా పిల్లలూ మేము ఏది చెప్తే అదే చేశారు..
ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాకపోయినా, లక్షల్లో డొనేషన్ కట్టి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్పించాం….
ఇంజనీరింగ్ అయ్యాకా, క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం వచ్చింది మా పెద్ద వాడికి…
మాకు అస్సలు ఆ ఉద్యోగం ఆనలేదు… అందరిలాగే అమెరికా పంపించాలని ఆశ… వాడిని జి.ఆర్.యి. టోఫెల్ ఎక్జామ్స్ వ్రాయించాం. ఏదో యావరేజ్ గా గట్టెక్కాడు…
అమెరికాలో అన్ని యూనివెర్సిటీస్ కి అప్లై చేయించాం…
ఇద్దరం ఉద్యోగస్థులం కదా… డబ్బుకి వెనకాడలేదు…
బాంక్ లోన్స్ పెట్టి మొత్తానికి అక్కడ యూనివర్సిటీస్ లో ఎయిడ్ రాకపోయినా మా డబ్బుతోనే పంపించేసాం…
అక్కడ చదువు అయ్యాకా అక్కడే ఉద్యోగం వచ్చింది..
మా ఆనందానికి అవధులు లేవు.. గర్వంగా ఫీల్ అయ్యాము..
రెండో వాడిని కూడా అదే దారిలో పెట్టేసాము…
రెండో వాడు వెళ్లనన్నాడు… “ఇక్కడే చదువుకుంటాను నాన్నా అని” రిక్వెస్ట్ చేశాడు…
మేము ఒప్పుకోలేదు… ఇండియాలో ఏముందిరా… డెవలప్మెంట్ ఉండదు… ఎక్సపోజర్ ఉండదు అని వాడిని ఒప్పించి, ఇంచుమించు బలవంతంగా ఆస్ట్రేలియా పంపించేసాం పై చదువుకి….
మాకు ఎంత గర్వంగా ఉండేదో… మా ఇద్దరి పిల్…

సేకరణ : డి. నర్సింహచారి

Leave A Reply

Your email address will not be published.

Breaking