అయ్యో .. వారిది సజీవ సమాధేనా ? ప్రశ్నర్ధకంగా మారిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు

అయ్యో .. వారిది సజీవ సమాధేనా ?  ప్రశ్నర్ధకంగా మారిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు

నాగర్ కర్నూలు, నిర్దేశం:
దక్షిణ తెలంగాణాలో పాలమూరు, నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు త్రాగునీరు అందించే బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ ఎస్ ఎల్ బి సి (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం) భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారింది. పద్దెనిమిది రోజుల క్రితం టన్నెల్ కూలిన ప్రమాద ఘటనలో ఒక మృతదేహం వెలికి తీయగా మరో ఏడుగురి ఆచూకీ ఇప్పటికి లభించలేదు. కేంద్ర,రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా అత్యాధునిక సాంకేతికత వినియోగించి రెస్క్యూ చర్యలు చేపట్టినప్పటికి ఆశించిన ఫలితం రావడం లేదు.ఈ దుర్గటన ఫై ప్రజలు, ప్రతి పక్షాలనుండి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్లో ఇటీవల జరిగిన ప్రమాదం రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఫిబ్రవరి 22, 2025న ఉదయం 8:30 గంటల సమయంలో టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు.ఈ ఘటనపై ప్రభుత్వం, విపత్తు స్పందన బలగాలు, సైన్యం, సింగరేణి సంస్థలు తక్షణ చర్యలు చేపట్టాయి. సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రజలు, రాజకీయ నాయకులు ఈ ఘటనపై తమ స్పందనను భిన్నంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలను ప్రారంభించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రోడ్లు భవనాలు శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుండి ఎన్డీఆర్ఎఫ్, నేవీ, జి పి ఆర్, సింగరేణి,స్పెషల్ డాగ్ స్కాడ్ ఇతర సాంకేతిక బృందాలను  కేంద్రమంత్రి ఆదేశాలతో రప్పించారు.నిరంతర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికి టన్నెల్ లో కురుకుపోయిన మట్టి, బురద, నీటి ఉట ల కారణంగా సహాయక చర్యలకు అడ్డంకి గా మారింది.
విపక్షాల  స్పందన:
ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. భారత రాష్ట్ర సమితి (BRS) నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల కుటుంబాలు వారి కుటుంబ సభ్యులను సురక్షితంగా తిరిగి తీసుకు వచ్చేందుకు ప్రార్థనలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు సహాయక చర్యలను వేగవంతం చేయాలని,ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితి
ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాద ఘటన లో ప్రస్తుతం సహాయక చర్యలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.టన్నెల్లో మట్టి, బురద, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలు సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ప్రత్యేక వ్యూహాలతో పనిచేస్తున్నాయి.  టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా డామేజ్ అయ్యింది, ఇది సహాయక చర్యలను మరింత క్లిష్టతరం చేసింది.ఈ ప్రమాదం కారణంగా ప్రాజెక్ట్కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.ప్రాజెక్ట్ భవిష్యత్తు ఫై నీలి నీడలు కమ్ముకున్నాయి.
టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు వివిధ రాష్ట్రాలకు చెందినవారు.  ప్రభుత్వం వారి సురక్షిత రక్షణకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే జిపియర్, డాగ్ స్కాడ్, ర్యాట్ మాన్ హోలర్స్, సింగరేణి, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాల సహాయంతో ఒక మృత దేహాన్ని వెలికి తీశారు. మిగిలిన వారి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.టన్నెల్ లో కన్వేయర్ బెల్ట్ తెగిపోవడం,నీరు, మట్టి, బురద చేరడం సహాయక చర్యలకు ప్రధాన ఆటంకాలుగా నిలిచాయి.
ఈ ప్రమాదం రాష్ట్రంలోని ప్రాజెక్ట్ ల భద్రతా ప్రమాణాలపై చర్చను రేకెత్తించింది. ప్రభుత్వం, రెస్క్యూ బృందాలు, సైన్యం, సింగరేణి సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »