కరీంనగర్ లో క్షుద్రపూజల కలకలం

కరీంనగర్ లో క్షుద్రపూజల కలకలం

వరంగల్, నిర్దేశం:

మంత్రాలకు చింతకాయలు రాలవు అని కొందరు అంటారు కదా.. ఎందుకు రాలవో చూస్తామంటున్నారు కొందరు మాయగాళ్లు. ప్రజలను నమ్మించి, మాటల్తో మాయ చేసి ఓం భీమ్ భుష్ అని మంత్రాలు మాత్రం మారడం లేదు.
ప్రస్తుతం అంతరిక్షంలో రాకెట్లు దూసుకెళుతున్నాయి. అరచేతిలోనే ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కానీ ఇలాంటి మూఢ నమ్మకాలు రాజ్యం ఏలుతున్నాయి. చేతబడి, క్షుద్రపూజల పేరుతో జనాలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా జనగామ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఏకంగా యువతి లోదుస్తులు క్షుద్ర పూజలలో కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.పాలకుర్తి గ్రామ శివారు దర్ధపల్లి వాగులో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. కోడిని బలిచ్చి, పసుపు, కుంకుమ నిమ్మకాయలతో పూజలు చేసినట్లు అనవాళ్లు ఉన్నాయి. క్షుద్రపూజలు చేసిన స్థలంలో యువతి లోదుస్తులు లభించాయి. యువతికి చేతబడి చేసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు.అయితే అర్ధరాత్రి సమయంలో మంత్రాల శబ్దాలు విని కొందరు రైతులు.. ఘటనా స్థలానికి చేరుకున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

అక్కడ రైతులను చూసి ముగ్గురు వ్యక్తులు పారిపోయినట్లు వారు తెలిపారు. వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దీని వెనుక ఎవరున్నారు. ఆ ముగ్గులో ఉన్న దుస్తులు ఎవరివి అన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ఎవరైనా యువకులు కావాలనే వశీకరణం పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారుఎవరు చేశారో ఎందుకు చేశారో తెలీదు. కానీ రోడ్లపై ఇలా భయంకరమైన పద్ధతిలో పూజలు చేయడం గ్రామాల్లో సంచలనంగా మారింది. స్త్రీ ఆకారంలో ముగ్గు వేయడం.. అందులో ఓ యువతి లో దుస్తులు ఉండటం చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సైకో పూజలు చేస్తుంది ఎవరు? చేయిస్తుంది ఎవరు పట్టుకుని జైల్లో వేస్తే.. వీళ్ల పవర్ ఏంటో తెలుస్తుందని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.మంత్రాల శబ్ధం వస్తున్న వైపు నెమ్మెదిగా.. అడుగుల శబ్దం రాకుండా జాగ్రత్తగా వెళ్తున్నారు. ముందుకు వెళ్తున్నా కొద్దీ మంత్రాలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. స్టెతస్కోప్ అవసరం లేకుండానే.. వాళ్ల గుండె చప్పుడు వాళ్లకే వినిపించేంతగా భయం పెరుగుతోంది. అయినా సరే.. వెనక్కి వెళ్లకుండా ఈ మంత్రాల సంగతేంటో తెలుసుకోవాలని నిర్ణయించుకుని ముందుకే సాగారు. కాస్త దూరం వెళ్లిన తర్వాత ఓ పొలం దగ్గర.. ముగ్గురు వ్యక్తులు కూర్చుకుని కనిపించారు. వాళ్లు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు కాస్త వేగంగా అడుగులు వేసేసరికి.. ఆ అలజడి విన్న ముగ్గురు రైతులను చూశారు. ఇంకేముంది.. అన్నీ అక్కడే వదిలేసి మెరుపు వేగంతో అక్కడి నుంచి పారిపోయారు.

వాళ్లను పట్టుకునేందుకు రైతులు కూడా ప్రయత్నించారు కానీ.. ఫలితం లేకపోయింది అప్పటివరకు ఆ ముగ్గురు కూర్చున్న దగ్గరి సన్నివేశం చూసి.. రైతులకు గుండెలు కడుపులోకి జారిపోయాయి. అక్కడ ఆ ముగ్గురు చేసింది.. మీరనుకున్నట్టుగానే క్షుద్రపూజే. అచ్చంగా పొలిమేర సినిమాలో చేసినట్టుగానే.. పసుపు, కుంకుమ, గులాల్‌తో ముగ్గేసి.. అందులో నిమ్మకాయలు పెట్టి, కోడిని కూడా బలిచ్చారు. అవన్నీ చూసి రైతులు భయపడగా.. అక్కడున్న మరో ఐటమ్ చూసి ఆశ్చర్యం కలిగింది. అదే.. అమ్మాయి లోదుస్తులు. అక్కడ క్షుద్రపూజ చేస్తున్నారు అందులో అమ్మాయికి చెందిన లోదుస్తులు ఉన్నాయంటే.. వాళ్లు ఎవరో యువతి మీద ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రయోగిస్తున్నారని రైతులకు అర్థమైంది.గుండెలు గులాబ్‌ జాములయ్యే ఈ ఘటన.. జనగామ జిల్లాలోని పాలకుర్తి గ్రామ శివారు దర్ధపల్లి వాగులో చోటుచేసుకుంది. ఈ క్షుద్ర పూజల విషయం గ్రామంలో తెలియటంతో.. గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఆ క్షుద్రపూజలు చేసిన ముగ్గురు వ్యక్తులు ఎవరూ..? వాళ్లు ఏ అమ్మాయి మీద బ్లాక్ మ్యాజిక్ చేశారన్నది.. ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.ప్రపంచమంతా విజ్ఞానంతో అంతరిక్షంలోకి వెళ్తుంటే.. మన వాళ్లు మాత్రం ఇప్పటికీ పసుపు, కుంకుము, నిమ్మకాయలు, నల్లకోడి, వెంట్రుకలు అంటూ క్షుద్రపూజలు, బ్లాక్ మ్యాజిక్ అంటూ ఇంకా అర్ధరాత్రులు భయపెట్టే విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. వాటిని చూస్తూ జనాలు భయపడుతూనే ఉన్నారు. అందులోనూ.. ఈ తాజా ఘటనలో ఓ అమ్మాయికి చెందిన లోదుస్తులతో క్షుద్రపూజలు చేస్తున్నారంటే.. ఎంతకు దిగజారిపోయారన్నది అర్థం చేసుకోవచ్చుముగ్గులు, నిమ్మకాయలు వేసి క్షుద్ర పూజలు చేయడం ఇటీవల ఎక్కడ బడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. ఇదంతా ఓ పెద్ద మూఢ నమ్మకం అని వివరించనా.. కొంత మంది మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తూ.. ఇలాంటి పూజలు నిర్వహిస్తున్నారు. గుప్త నిధుల కోసం, ప్రత్యర్ధులను నాశనం చేయడం కోసం క్షుద్రపూజలకు పాల్పడుతున్నారు కొందరు మూర్ఖులు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »