ఆ పోలీస్ బాస్ ఖతర్నాక్…

ఆ పోలీస్ బాస్ ఖతర్నాక్

– పొలిటికల్ ఫైరావీలు జాంతెనై..

– పోలీసులు తప్పు చేసినా శిక్ష తప్పదు..

– పోలీస్ అవినీతిపై ప్రత్యేక ఫోకస్..

– సామాన్య ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్..

అతను విధుల నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు.. అవినీతి పరుల గుండెల్లో తుపాకి గుళ్లులా దూసుకెళుతారు.. పొలిటికల్ ఫైరావీలు జాన్తేనై అంటారు.. కష్ట పడి పని చేసే వారి ప్రతిభకు ప్రధాన్యత ఇస్తారు.. చట్టం దృష్టిలో అందరూ సమానమే అంటారు.. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే నని నమ్మె నిజాయితీ పోలీసు ఆఫీసర్.. అతనే హైదరాబాద్ పోలీసు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.

సవాల్ లకు సవాల్ చేయడమే..

మతకలహాలు.. గూంఢయిజం..  సైబర్ క్రైమ్.. దొంగతనాలు.. వరకట్నం చావులు.. జాబ్ ల పేరిట మోసాలు.. అవినీతితో కంపుకొట్టుకు పోతున్న  ఈ హైదరాబాద్ నగరంలో సమర్థంగా కొత్వాల్ (పోలీస్ చీఫ్ ఆఫీసర్) గా విధులు నిర్వహించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరి కోరి శ్రీనివాస్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. అతని వద్ద పని చేయడం అంటే కింది స్థాయి పోలీసు అధికారులు సైతం ఒల్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. ముక్కుసూటిగా, నిక్కచ్చిగా వ్యవహరించే శ్రీనివాస్ రెడ్డి అదనపు డీజీపీ హోదా అధికారి. 1994లో బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ గా 29 ఏళ్లుగా వివిధ విభాగాలలో పని చేసిన అనుభవం అతని సొంతం. వృత్తి దైవంగా భావించే అతను హేతువాదం, శాస్త్రీయ దృక్పదంతో ఆలోచించి సామాన్యులకు సైతం శ్రీనివాస్ రెడ్డి న్యాయం చేస్తారు.

మహబూబ్ నగర్ జిల్లా ఎస్ పీగా..

కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇది వరకు మహబూబ్ నగర్ జిల్లాలో సూపరిండెంట్ ఆఫ్ పోలీసుగా విధులు  నిర్వహించారు. పోలీసు అధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలను సీరియస్ గా తీసుకునే వారు. అన్యాయం జరిగిందని పోలీసు స్టేషన్ కు వచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్న సందర్భాలు ఎన్నో. అతను ఎస్ పీగా విధులు నిర్వహించినప్పుడు దొంగతనాలు.. దోపీడిలు తగ్గి పోయాయి. మొదటి నుంచి పొలిటికల్ ఫైరావీలకు తలొగ్గని పోలీసు అధికారిగా అతనికి పేరుంది.

 

మావోయిస్టు నక్సల్స్ కోసం..

‘ఈ సీతయ్య ఎవరి మాట వినరు..’ అనే మాటను కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి సరిపోతుందానేది టాక్. ఒత్తిళ్లకు తలొంచడని భావించిన ప్రభుత్వం శాంతి భద్రతల విధులకు దూరంగా అతనికి పోస్టింగ్ లు ఇచ్చేది. ఎలైట్ యాంటీ మావోయిస్టు ఫోర్స్ గ్రేహౌండ్స్ కు బాస్ గా కొంత కాలం పని చేసారు. ఆంద్రప్రదేశ్, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి తెలంగాణ రాష్ట్రంలోనికి నక్సల్స్ ప్రవేశించకుండా కూంబింగ్ ఉదృతం చేసారు.

గ్రేహౌండ్స్‌కు కేటాయించిన వందల ఎకరాల ప్రభుత్వ భూమిని లాక్కోవడానికి కొందరు ప్రయత్నించినప్పుడు శ్రీనివాస్‌రెడ్డి కాపాడారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీం కోర్టులో వ్యాజ్యాన్ని కొనసాగించడంలో అతను వ్యక్తిగత ఆసక్తిని కనబరిచాడు. శ్రీనివాస్ రెడ్డి పని చేస్తున్న సమయంలోనే తెలంగాణ పోలీస్ కౌంటర్ టెర్రరిజం వింగ్ అయిన ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) ఆస్తి నేరానికి సంబంధించిన నేరస్థులతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఆగస్ట్ 2017లో మైలార్‌దేవ్‌పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లో చోరీకి విఫలయత్నం చేసిన తర్వాత రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో దాక్కున్నట్లు అనుమానిస్తున్న సాయుధ నేరస్థులను బయటకు తీయడానికి ఆక్టోపస్ కూడా రంగంలోకి దిగింది. DCP ట్రాఫిక్‌గా పనిచేసిన అతను ట్రాఫిక్ నిర్వహణలో నైపుణ్యం సంపాదించాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ పోలీసు కమీషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!