త్రిపుల్ తలాఖ్ తరువాత బీజేపీకి ముస్లీం మహిళల మద్దతు
: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
నిర్దేశం, హైదరాబాద్ :
చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద బీజేపీ విజయ సంకల్పయాత్ర ప్రచార రథాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డ్డి, బీజేపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘విజయ సంకల్ప యాత్ర’ పేరుతో భారతీయ జనతా పార్టీ మంగళవారం నుండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తాం. విజయ సంకల్ప యాత్ర ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమై మార్చి 2వ తేదీన ముగుస్తుంది.
నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావడం ఖాయం. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కావాలని అన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ గత పార్లమెంటు ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించింది. రాబోయే ఎన్నికల్లో 17 సీట్లు గెలవడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నామన్నారు ఆయన.
రాష్ట్రంలోని యువత, విద్యార్థులు, రైతులు, బడుగుబలహీన వర్గాల ప్రజలందరూ నరేంద్రమోదీ మరొకసారి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకోసమే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చామన్నారు ఆయన.
అగో గీ ట్రక్కు నడుపుతుందెవరో మంచిగు జూడుండ్రి. డ్రైవర్ అనుకుంటున్నారా..? ఔను.. బీజేపీ బండిని నడిపే కిషన్ రెడ్డియే అతను. చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద ప్రారంభించిన సంకల్పయాత్రలో ఇగో గీ ట్రక్కును నడిపి అందరిని ఆశ్చర్యపరిచారు.