ఉదయం వక్కపోత… సాయంత్రం కుండపోత
హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణ వాతావరణం చాలా వైవిధ్యంగా మారుతోంది. శుక్రవారం ఉదయం నుంచి సూర్యుడు నిప్పులు కురిపించాడు. సాయంత్రానికి వరుణుడు వచ్చి వడగళ్ల వానతో వాతావరణాన్ని చల్లబరిచాడు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నగరాన్ని ముంచేసింది. చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ఆఫీస్‌ల నుంచి వచ్చే టైం కావడంతో జనం ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్‌లోని మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, ఫిలింనగర్, గచ్చిబౌలి, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, కోఠి, నాంపల్లి, అబిడ్స్ ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, రాజేంద్రనగర్, అంబర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, హయత్‌నగర్ వర్షం కుమ్మేసింది. దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా అరగంటపాటు వర్షం కురిసింది. ఈ వర్షంతో మహానగరం అతలాకుతలమైపోయింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలుులతో కూడిన వర్షం వణికించింది. బస్సులు, కార్లు, వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. చెట్లు పడటంతో మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. వర్షం జోరుగా పడటంతో అధికారులు చేపట్టే సహాయక చర్యలకు కూడా త్వరగా పూర్తి కాలేదు. వర్షం తగ్గిన తర్వాత పనులు పూర్తి చేశారు. హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలో చాలా జిల్లాల్లో జోరువానలు కురిశాయి. సిద్దిపేట, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వడగళ్లవాన ప్రజలను భయపెట్టింది. ఈ అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. గత నెల రోజు నుంచి రోజూ ఏదో ప్రాంతంలో కురుస్తున్న వడగళ్ల వాన పంటలకు నష్టాన్ని కలిగిస్తోంది. మహారాష్ట్ర నుంచి అంతర్గత కర్ణాటక, రాయలసీయ, తమిళనాడు మీదుగా గల్ఫ్ మన్నార్ వరకు ఏర్పడిన ద్రోణి ఈ వాతావరణానికి కారణమవుతోంది. మరో మూడు రోజులు తెలంగాణలో ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండులు ఠారెత్తిస్తాయి. సాయంత్రానికి ఉరుములు మెరుపులు, పిడుగులు, వడగళ్ల వాన దంచి కొట్టబోతోంది. అందుకే మూడు రోజుల పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం ఉదయం వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు: నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సోమవారం ఉదయం వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలు: రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.