కార్మికుల సొమ్ము అదానికి దోచిపెడుతున్న మోడి

కార్మికుల సొమ్ము అదానికి దోచిపెడుతున్న మోడి

కెటిఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.

పాలకులకొక న్యాయం… సామాన్యులకో న్యాయమా?

: బిఎస్ పి నేత డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గద్వాల, మార్చి 30 (వైడ్ న్యూస్) కార్మికులు,ఉద్యోగులు కష్టం చేసి చెమటోడ్చి సంపాదించి కూడబెట్టుకున్న డబ్బును కూడా ప్రధాని మోడి,అదానీకి దోచిపెట్టారని డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇందులో మోసపోయిన వారిలో 85 శాతం ప్రజలు హిందువులే ఉన్నారని, హిందువుల ఓట్లతో గెలిచిన మోడీ హిందువుల సొమ్మునే దోచుకుంటున్నారని మండిపడ్డారు.

బిసి కులగణన చేయకుండా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచకుండా రాష్ట్రంలో మరియు దేశంలో బిసిల ఓట్లు ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా 205వ రోజు యాత్ర ఆలంపూర్ నియోజకవర్గంలో కొనసాగింది.

మంత్రి కెటిఆర్ అధికార దుర్వినియోగానికి పాబ్పడ్డారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పబ్లిక్ సర్వీసం కమీషన్ కు సంబంధించిన అధికారిక డాటా ఇతనికి ఎలా దొరికిందని అడిగారు.పేపర్ లీకేజీలో కెటిఆర్ పాత్ర ఖచ్చితంగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.అందుకే కేసును సిబిఐ కి అప్పగించి కెటిఆర్ ను విచారించాలని డిమాండ్ చేశారు.

పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మెన్,బోర్డు సభ్యులను తొలగించకుండా తిరిగి నియామకాలు చేపడితే,విద్యార్థులకు అవినీతి లేకుండా జరుగుతుందన్న నమ్మకం ఉండదన్నారు.చైర్మెన్ మరియు బోర్డు సభ్యులను తొలగించిన తర్వాతనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

యాత్రలో భాగంగా ఆయన ఎర్రవల్లి చౌరస్తా, ఆలంపూర్ చౌరస్తా మరియు శాంతినగర్ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేశారు. దోపిడీ పాలకులు వేల కోట్ల కమీషన్ల కోసం ప్రాజెక్టులు కట్టి నీళ్లను ఫాం హౌస్ లకు తరలించుకున్నారని విమర్శించారు.కానీ బిఎస్పి పార్టీ పేదల బాధలు కష్టాలను అర్దం చేసుకొని వారి అవసరాలను తీర్చుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవితపై ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లుగానే,ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేసి తప్పుడు సమాచారం చేసి,తనను,సామాన్య ప్రజలను, జర్నలిస్టులను  హింసించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పాలకులకొక న్యాయం సామాన్యులకొక న్యాయం ఎలా ఉంటుందని పోలీసు అధికారులను ప్రశ్నించారు.

ఉప్పల్ క్యాంపు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం కుర్విరాల గ్రామంలో రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.బహుజన రాజ్యంలో ధరణిని రద్దు చేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

యాత్రలో జిల్లా అధ్యక్షులు కేశవరావు,నియోజకవర్గ ఇంచార్జి మధు గౌడ్,మహిళా జోనల్ కన్వీనర్ రాములమ్మ, నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!