ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్టు ఎందుకంటే..?
హైదరాబాద్, ఏప్రిల్ 6 (వైడ్ న్యూస్) గోషా మహల్ ఎమ్మెల్యే రాజసింగ్ సింగ్ ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హనుమాన్ జయంతి కార్యక్రమం ర్యాలీ నేపథ్యంలో అరెస్ట్ చేసారు. విశ్వ హిందూ పరిషత్తు, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గౌలిగూడా దేవాలయం నుండి తాడిబాన్ హనుమాన్ దేవాలయం వరకు హనుమాన్ ర్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
రాజాసింగ్ ప్రతి సంవత్సరం ర్యాలీ పాల్గొంటూ వస్తున్నారు. ఆ ర్యాలీ పాల్గొనాకుండా ముందస్తుగా అయననుఅరెస్ట్ చేసారు పోలీసులు తీరుపై రాజసింగ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ లో 8వ నిజం పాలన నడుస్తోంది అంటు విమర్శలు గుప్పించారు. ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ ని అరెస్ట్ చేసి జైలు పెట్టారు.. మరోవైపు నన్ను అరెస్టు చేస్తున్నారని విమర్శించారు