వీడిన రాజలింగమూర్తి హత్య కేసు

వీడిన రాజలింగమూర్తి హత్య కేసు

కరీంనగర్, నిర్దేశం:
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూపాలపల్లి కి చెందిన రాజలింగమూర్తి ని హత్య కేసు మిస్టరీ వీడింది. నిందితులను పోలీస్ లు అరెస్ట్ చేశారు.  రాజలింగముర్తి హత్య కు భూవివాదాలే కారణమని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే చెప్పారు. రాజలింగమూర్తి మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో కేసు వేయడంతో కేసీఆర్, హరీష్ రావు, మేడిగిడ్డ నిర్మాణ సంస్థకు కోర్టు గతంలో నోటీసులు జారీ చేసింది. అయితే రాజాలింగమూర్తి ఈ నెల 19 వ తేదీన హత్యకు గురైతే 20 వ తేదీన కోర్టులో మేడిగడ్డ పై విచారణ ఉండడంతో సంచలనంగా మారి రాజకీయ రంగు పులుముకుంది. రాజలింగమూర్తి ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హత్య చేయించాడని, వెంకటరమణారెడ్డికి కేసీఆర్, హరీష్ రావు సహకరించారని మృతుడి భార్య సరళ ఆరోపించారు. దీంతో హత్యపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆమె డిమాండ్ చేశారు. రాజలింగమూర్తి ఈ నెల 19వ తేదీన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలని లో రాత్రి 8 గంటల సమయంలో దుండగులు కత్తిలతో దాడి చేసి హతమార్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. పతకం ప్రకారమే లింగమూర్తి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్య జరిగిన మరుసటి రోజు భూ వివాదాల నేపథ్యంలోనే హత్యకు గురైనట్లు ప్రాథమిక విచారంలో తేలడంతో రేణుకుంట్ల సంజీవ్, పింగళి శ్రీమంత్, మోరే కుమార్, కొత్తూరి కుమార్, రేణుకుంట్ల కొమురయ్యపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు పోలీస్ లకు సవాలుగా మారడంతో విచారణను వేగవంతం చేసి భూపాలపల్లి పోలీస్ లు అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితుల, పరారి లో ఉన్న నిందితుల పేర్లను భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే వివరించారు. ఏ1 రేణికుంట్ల సంజీవ్ (36), ఏ2 పింగిలి సీమంత్ (22), ఏ3 మోరె కుమార్ (35), ఏ4 కొత్తూరి కుమార్ (38), ఏ5 రేణికుంట్ల కొమురయ్య (60), ఏ6 దాసరపు కృష్ణ (45), ఏ7 రేణికుంట్ల సాంబయ్య (56) లని తెలిపారు.ఏ8 కొత్త హరిబాబు, భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ (బీఆర్ఎస్), ఏ9 పుల్ల నరేష్, ఏ 10 పుల్ల సురేష్ పరారీలో ఉన్నారని పోలీస్ టీం లు గలిస్తున్నాయని ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి 2 కత్తులు, 2 రాడ్లు , 5 బైక్‌లు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నలుగురు కలిసి హత్య చేయగా.. ఇద్దరు రెక్కీలో పాల్గొన్నారని, మిగతా వారు నిందితులు హత్య చేసిన వారితో అటాచ్‌ లో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. భూపాలపల్లి లోని ఎకరం భూమి విషయంలో రేణుకుంట్ల సంజీవ్ కుటుంబం సభ్యులకు, హత్యకు గురయిన రాజలింగమూర్తికి వివాదం కొనసాగుతుంది. ఈ భూమికి సంభందించి కోర్టులో సైతం కేసు కొనసాగుతుందని ఎస్పీ చెప్పారు. రజలింగమూర్తిపై కక్ష తీర్చుకోవడానికి రేణుకుంట్ల సంజీవ్ కుటుంబం హత్య చేసినట్లు ఎస్పీ చెప్పారు. మూడు నెలల హత్యకు ప్లాన్ చేశారన్నారు.అయితే నిన్న ఆదివారం పోలీస్ లు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కిరణ్ ఖరే మీడియా కు చెప్పిన వెంటనే రాజలింగమూర్తీ భార్య సరళ మీడియా సమావేశం పెట్టీ హత్య కు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి కారణమని ఆయనకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు సహకరించారని సరళ మరోసారి ఆరోపణలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణం, అవకతవకలపై రాజలింగమూర్తి కేసు వేసినందుకే హత్య చేయించారని సరళ ఆరోపించారు. హత్యకు భూ వివాదం కారణం కానే కాదని ఆమె చెబుతున్నారు. కేసు విచారణకు వస్తున్న సమయంలో గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరుడైన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ హరిబాబుతో హత్యకు ప్లాన్ చేసి రాజలింగమూర్తిని చంపారని సరళ ఆరోపించారు. ముమ్మాటికీ గండ్ర వెంకటరమణ రెడ్డి, కేసీఅర్, కేటీఆర్, హరీష్ రావు లు చేయించిన హత్యేనని సరళ ఆవేదన వ్యక్తం చేశారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »