మోకాలి శస్త్రచికిత్సకు మంత్రి వేముల ఆర్ధిక భరోసా
1లక్ష రూపాయల ఎల్వోసి అందజేసిన మంత్రి
హైదరాబాద్, ఆగష్టు 24 : బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం సాహెబ్ పేట్ కు చెందిన పి. అశోక్ నిమ్స్ హాస్పిటల్ లో మోకాలి సర్జరీ కోసం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 1లక్ష రూపాయల ఎల్వోసీ మంజూరి చేయించారు.
సంబంధిత ఎల్ఓసి కాపీని వారి కుటుంబ సభ్యులకు మంత్రి గురువారం హైదరాబాద్ లో అందజేశారు. నిరుపేదలమైన మాకు సర్జరీ కోసం 1లక్ష రూపాయల ఎల్ఓసి మంత్రి గారు మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి గారి మేలు మర్చి పోలేమని,ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేసారు.