నిర్దేశం, హైదరాబాద్ః సీజన్ వర్షాకాలమే కాబట్టి.. అందుకు తగ్గట్టుగానే గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో జనాలు ఇంట్లోంచి బయటకు రావడానికి సంకోచిస్తున్నారు. బురద, ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్ల భయం సహజంగానే ఉంది. అయితే వర్షం ఎంతలా పడుతున్నా.. మన పనుల నిమిత్తం బయటకు వెళ్లక తప్పదు. చాలా మందికి వర్షంలో తడవాలని సరదాగా ఉంటుంది. అయితే వర్షంలో తడిస్తే జ్వరం, జలుబు, దగ్గు వస్తాయని అందరూ భయ పడిపోతూ ఉంటారు. కానీ వర్షంలో తడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని, చాలా సమస్యలు నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి వర్షంలో తడవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది
వర్షంపు నీటిలో చాలా రకాల ఖనిజాలు ఉంటాయట. వర్షపు నీటిలో ఉండే ఖనిజాలు మనుషులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా ఈ నీళ్లలో ఉండే ఆల్కలీన్ పీఎఫ్.. మన జుట్టును బలంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి వర్షంలో తడవడం వల్ల ఎలాంటి నష్టం లేదట.
చర్మం ఆరోగ్యం
వర్షంలో తడవడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుందట. వర్షపు నీటిలో ఎన్నో రకాల ఖనిజాలు ఉంటాయట. ఇవి మన శరీరంలోపై మురికిని, డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగిస్తుందట. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది వర్షపు నీటిలో స్నానం చేయడం వల్ల చర్మం ఆరోగ్యం పెరుగుతుందని చెప్తున్నారు. వర్షపు నీటిలో తడవడం వల్ల ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గిపోతాయట. వర్షంలో తడవాలని చాలా మందికి సరదాగా ఉంటుంది. కాబట్టి వర్షం నీటిలో తడిస్తే చిన్న పిల్లలా సంతోష పడతారు. వర్షంలో స్నానం చేసినప్పుడు శరంలోని సెరోటెనిన్, ఎండార్పిన్లు అనే హార్మోన్లు రిలీజ్ అవతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి.. మనసును ప్రశాంతంగా ఉంచుతాయట.
హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి
వర్షంలో స్నానం చేయడం వల్ల శరీరం, మనసు కూడా చాలా రిలాక్స్ అవుతాయట. కాబట్టి హార్మోనులను కూడా బ్యాలెన్స్ అవుతాయట. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా విటమిన్ బి12 కూడా చక్కగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు.