– పైసా పంచకుండా ప్రజలను ఆకర్షిస్తున్న స్వతంత్ర అభ్యర్థి
– వేలాది మందితో కరీంనగర్ లో నామినేషన్ ర్యాలీ
– ఎదురుగా ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలుస్తున్న ఓటర్లు
– రాజకీయాల్లోకి వచ్చి 3 నెలల్లోనే ప్రభంజనం
– రాజకీయాల్లో నూతన ఒరవడి తీసుకువస్తున్న గంగాధర్
ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా డీఎస్పీ గంగాధర్ నామినేషన్ వేశారు. శుక్రవారం వేలాదిగా వచ్చిన ఓటర్లతో కరీంనగర్ పట్టణంలోని కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి.. నామినేషన్ పత్రాలను కరీంనగర్ కలెక్టర్ పమిల సత్వతికి అందించారు. ర్యాలీలో గంగాధర్ కు దారిపొడవున పూలతో స్వాగతం పలికారు ఓటర్లు. తమలో నుంచి ఒక నాయకుడు వచ్చాడంటూ, అతడిని గెలిపించాలంటూ నినాదాలు చేశారు. కళాబృందాలు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో ఆశీర్వదించారు. నిజానికి, ఒక్కడిగా రాజకీయ బరిలోకి దిగిన గంగాధర్.. అనతి కాలంలోనే వేలాది మంది ఓటర్ల మద్దతును కూడగట్టుకున్నారు. ఆయనకు ప్రజా బలం ఎంత పెరిగిందనేది కరీంనగర్ లో జరిగిన ర్యాలీ చూపించింది.
పైసా పంచకుండా ప్రజా మద్దతు
నేటి రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డబ్బులు లేకుండా రాజకీయం అనేది ఊహకు కూడా అందనిది. డబ్బులు లేకుండా వస్తే ఓటర్లు కూడా ఒప్పుకోవడం లేదు. ఇలాంటి సమయంలో.. ఒక్క రూపాయైనా పంచకుండా ప్రజా మద్దతు కూడగట్టారు గంగాధర్. ప్రజలను ఒప్పించి, వారి మెప్పు పొందారు. ఎంతలా అంటే.. ఎన్నికల ఖర్చు కోసమని ప్రజలే గంగాధర్ కు ఎదురుగా డబ్బులు ఇస్తున్నారు. ఆయన కోసం స్వచ్చందంగా ప్రచారం చేస్తున్నారు. మనలో నుంచి వచ్చిన ఒకడు.. మనందరికీ ఒకడిగా ఉంటాడని, అందుకే మన గంగాధర్ ను గెలిపించుకోవాలని ఓటర్లే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా, డబ్బు లేకుండా రాజకీయ రంగంలో రాణించొచ్చని గంగాధర్ నిరూపిస్తున్నారు.
అంగరంగ వైభవంగా సాగిన ర్యాలీ
ముందుగా పలు జిల్లాల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు కరతాల ధ్వనుల నడుమ రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి, ర్యాలీని ప్రారంభించారు. దారిపొడవునా పూల తోరణాలు, సబ్బండ వర్గాల కరతాల ధ్వనులతో గంగాధర్ కు స్వాగతం పలికారు. ఆయన ఇచ్చిన ఒక్క పిలుపును అందుకొని, వేలాది మంది నామినేషన్ ర్యాలీకి వచ్చారు. కళాబృందాలు ప్రత్యేక ప్రదర్శనలు, మహిళలు మంగళహారతులు, సబ్బండ వర్గాల ఆశీర్వనాల నడుమ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు గంగాధర్. ఉత్సాహవంతంగా ప్రారంభమైన ర్యాలీ.. అంతే ఉత్సాహంగా కరీంనగర్ కలెక్టరేట్ వరకు సాగింది. అంగరంగవైభవంగా జరిగిన ర్యాలీ అనంతరం.. నామినేషన్ పత్రాలను కరీంనగర్ కలెక్టర్ కు సమర్పించారు.
ఒటు-నోటు మద్దతు
ఓటు మాత్రమే కాకుండా.. నోటు మద్దతు కూడా గంగాధర్ కు వస్తోంది. ఓటర్లు స్వచ్ఛంగా ఆయన ఎన్నికల ఖర్చు కోసమని చందాలు ఇస్తున్నారు. గజ్వేల్ కు చెందిన మిందె కనకయ్య బృందం ప్రత్యేకంగా చందాలు వసూలు చేసి ఈరోజు నామినేషన్ ర్యాలీలో గంగాధర్ కు ఇచ్చారు. ఇక రిటైర్డ్ ప్రిన్సిపల్ మోతె శివశంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గంగాధర్ కు ఆయన 50,000 రూపాయల మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “గంగాధర్ గెలుపు సమజానికి అవసరం. ఆయన విజయం సమాజంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. అయితే ఆయన దగ్గర డబ్బు లేదు. అందుకే మేము ఓట్ల కంటే ముందు ఆయనకు నోట్ల మద్దతు ఇస్తున్నాం. ప్రచారం చేస్తున్నాం. పోలింగ్ రోజు ఓట్ల మద్దతు ఇస్తాం” అని అన్నారు.