Take a fresh look at your lifestyle.

డ్రగ్స్ కు అడ్డగా హైదరాబాద్.. బెంగుళూర్ తో లింకులు

0 13

నగరంలో మత్తు కలకలం… !

  • డ్రగ్స్ కు అడ్డగా హైదరాబాద్
  • బెంగుళూర్ తో లింకులు
  • పట్టుబడుతున్న సినీ ప్రముఖులు
  • తప్పించుకుంటున్న రాజకీయ నాయకులు

నిర్దేశం, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో తరచూ మత్తు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. వారం రోజుల వ్యవధిలో పలువురు సినీ ప్రముఖులతో పాటు ఇతర ప్రముఖులు పట్టుబడ్డారు. మాదక ద్రవ్యాలతో పలువురు రాజకీయ నాయకులకు కూడా సంబంధాలున్నప్పటికీ వారు పట్టుబడటం లేదు. కేవలం చిత్రపరిశ్రమకు చెందిన వారే పట్టుబడుతున్నారు. హైదరాబాద్ నగరానికి మత్తు పదార్థాలు వివిధ మార్గాల ద్వారా భారీగానే వస్తున్నట్లు తెలుస్తోంది. నైజీరియన్ లే గాకుండా స్థానికులు కూడా గోవా నుంచి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యావంతురాలు అనురాధ డ్రాగ్స్ కు బానిసై ఆ తరువాత డ్రాగ్స్ సరఫరానే వృత్తిగా ఎంచుకొని ఇటీవల అరెస్ట్ అయ్యింది.  ఆమెతో పాటు వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి మరొకరు అరెస్టు అయ్యారు. తాజాగా సినీ దర్శకుడు, హీరో, నిర్మాతకు డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియన్ తో సంబంధాలు బయట పడ్డాయి. సినీ ఫైనాన్సీయర్ వెంకటరత్నరెడ్డి, దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి మహబూబ్ నగర్ మాజీ ఎంపీ విఠల్ రావు కుమారుడు, దేవరకొండ సురేష్ రావుతో పాటు మరి కొందరిని అరెస్ట్ చేశారు. సినీ నటుడు నవదీప్, షాడో చిత్ర నిర్మాత రవి ఉప్పలపాటికి సంబంధాలున్నట్లు టీఎస్ న్యాబ్ అధికారులు ప్రకటించారు. నవదీప్ పరారీలో ఉన్నట్లు ప్రకటించగా, తాను స్థానికంగానే ఉన్నానని ప్రకటించి అరెస్ట్ కాకుండా కోర్టును ఆశ్రయించాడు. నెల రోజుల క్రితం ఒక సినీ నిర్మాత కూడా డ్రగ్స్ వ్యపారం చేస్తూ పట్టుబడ్డాడు.

బెంగుళూర్ నుంచి సరఫరా..

హైదరాబాద్ నగరం మత్తు పదార్థాలకు అడ్డాగా మారింది. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఐపిఎస్ ఆఫీసర్ తో తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసింది. తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరో లో ప్రత్యేకంగా అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమించింది. ఈ వింగ్ తరచూ దాడులు నిర్వహిస్తూ డ్రగ్స్ పట్టుకుంటున్నప్పటికీ అక్రమ రవాణ ఆగడం లేదు. బెంగుళూర్ నుంచి నైజీరియన్ లు హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం బెంగుళూర్ లో పోలీసులు డ్రగ్స్ మాపీయాను పట్టుకున్నారు. అప్పట్లో డ్రగ్స్ తో తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులకు సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నందున తెలంగాణకు చెందిన బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తారని ప్రజలు భావించారు. కానీ, రాజకీయ నాయకులను అరెస్టు చేయలేదు. ప్రస్తుత కేసులో పరారీలో ఉన్న కలహర్ రెడ్డి అప్పట్లో బెంగుళూర్ కేసులో నిందితుడు.

నవదీప్ కు బెయిల్ నిరాకరణ..

మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీహీరో నవదీప్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనకు ముందస్తూ బెయిల్ చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. నవదీప్ కు బెయిల్ ఇవ్వొద్దంటూ నార్కొటిక్ పోలీసుల వాదనతో న్యాయం స్థానం ఏకీభవించింది.  పోలీసుల రూల్స్ అనుచరించాలని సూచించింది. నవదీప్ ను విచారించడానికి ముందుగా 41 (ఏ) కింద నోటీస్ ఇవ్వాలని పోలీసులను కోర్టుల ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నవదీప్ ను విచారించనున్నారు. సహకరించక పోతే అరెస్ట్ చేసే అవకాశముంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking