కిషన్ వ్యూహం.. మండలి ఎన్నికల్లో స్వీప్…
హైదరాబాద్, నిర్దేశం:
ఎవరైనా గట్టిగా కొడతారు.. లేకపోతే గురి చూసి కొడతారు.. ఈయనేంట్రా పద్దతిగా అంటు కట్టినట్లుగా కొట్టాడు” అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది.
ఇది ప్రస్తుత తెలంగాణ రాజకీయాలలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు బీజేపీ గెల్చుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి.. పోలింగ్ లో ఓట్లు వేయించుకునే వ్యూహం వరకూ తనదైన వ్యూహాలతో నడిపించిన కిషన్ రెడ్డి సైలెంట్ గా కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బకొట్టారు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో బీజేపీని బలోపేతం చేయడమే కాదు… సానుభూతి పరుల్ని ఓటర్లుగా మార్చే వ్యూహంలో కిషన్ రెడ్డి తనదైన నాయకత్వాన్ని చూపించారు.
తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో లభిస్తోందని దాన్ని ఓట్లుగా మార్చుకునే మెకానిజాన్ని కిషన్ రెడ్డి ఓ ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసుకుంటూ పోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయని తెలిసిన వెంటనే.. కార్యాచరణ ప్రారంభించారు. పట్టభద్రుల నియోజకవర్గం నాలుగు ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో ఉంటుంది. అంటే టీచర్స్ నియోజవర్గాలు రెండింటిని కలుపుకుంటే 13 జిల్లా, 42 అసెంబ్లీ స్థానాలు, 270 మండలాలు, ఆరు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగాయి.
అన్ని చోట్లా ప్రతి గ్రాడ్యూయేట్, టీచర్ ఓటర్‌ను చేరేలా పకడ్బందీ ప్రచార ప్రణాళికను .. ప్రతి ఒక్క ఓటర్‌ను మూడు, నాలుగు సార్లు కలిసేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ వ్యూహాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోయింది.. చేధించలేకపోయిందని.. ఫలితాలను బట్టి అర్థమవుతోంది. టీచర్స్ నియోజకవర్గంలో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కొమురయ్య గెలిచారు. పట్టబద్రుల నియోజకవర్గంలో అత్యంత హోరాహోరీగా జరిగినా ఓట్లు చీల్చే వ్యూహాలను కాంగ్రెస్ పార్టీ పాటించినా బీజేపీ విజయాన్ని ఆపలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డికి .. ఆ ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో సమయం సరిపోలేదు. ఓ వైపు కేంద్ర మంత్రిగా ఈశాన్య రాష్ట్రాల గురించి పట్టించుకుంటూనే తెలంగాణలో ఎన్నికలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయిపప్పటికీ.. పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానం నుంచి ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు చేరింది. ఓటు బ్యాంక్ 14 శాతానికి చేరింది. అంతకు ముందు ఈ ఓటు బ్యాంక్ ఆరు శాతం వరకే ఉండేది. ఈ ఉత్సాహంతో కిషన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలపై గురి పెట్టారు. ఐదు నెలల్లోనే పార్టీని ఆయన బలోపేతం చేశారు. మోదీ చరిష్మాను ఉపయోగించుకుని .. లోక్ సభ ఎన్నికల్లో గరిష్టంగా సీట్లు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఎనిమిది పార్లమెంట్ సీట్లలో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. రెండు, మూడు చోట్ల మినహా అన్ని చోట్ల రెండో స్థానంలో నిలిచింది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ 35 శాతానికి పెరిగింది. అంటే అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఉంది. లోక్ సభ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చిన మెజార్టీలు చూస్తే.. 40 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. భారతీయ జనతా పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన నేత కిషన్ రెడ్డి. ఆయనకు పార్టీ భావజాలంపై, విధానాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. ఏ మాత్రం పార్టీ లైన్ దాటరు. ఇప్పటి వరకూ ఆయన వివాదాస్పదంగా చేసిన ఒక్క ప్రకటన ఉండదు. అలాగని పార్టీ విధానాలను బలంగా చెప్పలేదన్న అభిప్రాయం కూడా ఉండదు. బీజేపీ ఐడియాలజీని ఎంత బలంగా చెబుతారంటే..ఆయన మాటల్ని ఎవరూ వివాదాస్పదం చేయలేరు. అలాంటి రాజకీయంతోనే బీజేపీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఇతర నేతలపై పరుషంగా మాట్లాడితేనో.. తిట్లందుకుంటేనో వార్తల్లో ఉంటామని.. దాని వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. అందుకే ఎప్పుడు అలాంటి రాజకీయం చేయరు. కానీ రాజకీయంగా ఎప్పుడూ పార్టీ విధానాలు, భావజాలం విషయంలో రాజీపడరు. తెలంగాణ బీజేపీకి అలాంటి పునాదులు వేసిన కిషన్ రెడ్డి .. ఇప్పుడు విజయాల పరంపరంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో కిషన్ రెడ్డి స్టైల్ ను జాతీయ నాయకత్వాన్ని కూడా ఆకర్షించింది. అందుకే పార్టీ పరంగా అయినా పాలన పరంగా అయినా కీలకమైన బాధ్యతల్ని అప్పగిస్తూ వస్తున్నారు. మొదటగా కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ చేశారు కానీ కొద్ది కాలానికే ఆయనకు కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించింది. ఐదుగురు సహాయ మంత్రులు కిషన్ రెడ్డి శాఖలను చూసేందుకు ఉండేవారు. వెంటనే మరోసారి మోదీ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. కిషన్ రెడ్డి పనితీరుపై నమ్మకంతోనే కేంద్రమంత్రిగా ఉంటూనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా కొనసాగించారు. మామూలుగా అయితే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. పార్టీ పరమైన బాధ్యతల నుంచి విముక్తి చేస్తారు. రెండింటికి న్యాయం చేయలేరని అనుకుంటారు. కానీ కిషన్ రెడ్డి పనితీరుపై కేంద్ర పెద్దలకు ఉన్న నమ్మకం వల్ల ఆయనను కొనసాగించారు. గతంలో అమిత్ షా మాత్రమే జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కొనసాగారు. ప్రధాని మోదీతో కలిసి కింది స్థాయి నుంచి కలిసి పని చేశారు కిషన్ రెడ్డి. ఆయన నిజాయితీ, కష్టపడే తర్వాత మోదీకి బాగా తెలుసు. జాతీయ నాయకత్వం మద్దతుతో కిషన్ రెడ్డి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తున్నారు. కిషన్ రెడ్డి దశాబ్దాల రాజకీయంలో అధికారంలో పదవులు చేపట్టింది చాలా తక్కువ. పార్టీ కార్యకర్త, పార్టీ నేతగానే ఎక్కువగా పని చేస్తూ వచ్చారు. తెలంగాణలో పార్టీ బలోపేతం వెనుక కిషన్ రెడ్డి వేసిన పునాదులే కీలకం. ఇప్పుడు ఆయనే తెలంగాణలో బీజేపీని అజేయశక్తిగా మారుస్తున్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. బీజేపీదే విజయం అన్నంతగా తెచ్చారు. ఇప్పుడు బీజేపీ ఎదురుచూస్తోంది.. పోరాడుతోంది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసమే. ఈ విజయం వెనుక కిషన్ రెడ్డి ముద్ర చాలా బలంగా కనిపిస్తుంది. అందులో సందేహం ఉండదు.
మొదటి నుంచి కనిపించిన పోటీ
భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం ఖరారైంది. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 73,644 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 63,404 ఓట్లు పడ్డాయి. అంజిరెడ్డి విజయం ఖరారు కావడంతో కౌంటింగ్ హాలు నుంచి నరేందర్ రెడ్డి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి చివరి వరకూ గట్టిగా పోరాడారు. కౌంటింగ్ ఉత్కంఠగా సాగింది. మొదట్లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. కొన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ ఓట్లు వచ్చాయి. తర్వాత మళ్లీ అంజిరెడ్డి ముందుకు వచ్చారు.బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా బలమైన పోటీ ఇచ్చారు. నామినేషన్లు పూర్తయ్యే నాటికి కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్ల మధ్యే పోటీ ఉంటుందని అనుకున్నా.. ప్రసన్న హరికృష్ణ అనూహ్యంగా మిగతా ఇద్దరు క్యాండిడేట్లకు ప్రధాన ప్రత్యర్థిగా మారారు. రాష్ట్రంలో బీసీ నినాదం బలపడుతుండడం, చివరి రెండు రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లు హరికృష్ణ కోసం పని చేయడంతో రేసులోకి వచ్చారు. నిజానికి ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించినా అవకాశం రాలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని కూడా ప్లాన్ చేశారు. అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో బీఎస్పీ తరఫున బరిలోకి దిగారు. కాంపిటీటివ్ బుక్స్ రచయితగా పేరున్న వ్యక్తి కావడంతో.. గ్రాడ్యుయేట్లకు అందులోనూ ప్రధానంగా నిరుద్యోగులకు ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. చివరి నిమిషంలో బీఆర్‌ఎస్ పరోక్ష మద్దతు కూడా కలిసొచ్చినట్లయింది. కానీ ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. విజయం సాధించిన బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ముగ్గురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు చేసిన ప్రచారం చేశారు. ఉత్తర తెలంగాణలో పెరిగిన బలం, నిరుద్యోగులు, ఉద్యోగుల్లో బీజేపీ పట్ల సానుకూల ధోరణి ఆ పార్టీ అభ్యర్థి విజయానికి దోహదపడ్డాయి