Take a fresh look at your lifestyle.

కేసీఆర్ అవినీతి ధ్యేయంగా పాలన : డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

0 92

అభివృద్ది స్కీంలు స్కాంలుగా మారాయి..

: బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

కామారెడ్డి, ఏప్రిల్ 4 (వైడ్ న్యూస్) తెలంగాణలో  స్కీంలన్నీ స్కాంలుగా మారాయని ద్వజమెత్తారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. జుక్కల్ నియోజక వర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన సందర్భంగా పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో నేను ప్రధాని అభ్యర్థి అయితే ఎన్నికల ఖర్చు అంతా నేనే పెడతా అని సీఎం కేసీఆర్ అన్నారు. అంటే ఎన్ని వేల కోట్లు దోచుకొన్నారో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్ ఆస్థులపై ఈడి, సిబిఐ, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని అక్రమ ఆస్తులు ఎలా వచ్చాయో తేల్చాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటికీ ఒక పక్క ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు.. ఫించన్లు ఇవ్వలేదు.. మరోపక్క ఇన్ని వేల కోట్ల ఆస్తి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. మోడీ అదానితో కలిసి దేశాన్ని దోచుకున్నట్లే కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కవిత లిక్కర్ స్కాం కేవలం సముద్రంలో ఒక చుక్కలాంటిది మాత్రమేనని అన్నారు ఆయన.

10 వ తరగతి పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేని విద్యా శాఖ మంత్రి అవసరమా అని ప్రశ్నించారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. పరీక్ష పేపరుల లీకేజ్ లకు నైతిక బాధ్యత వహించి సబితా ఇంద్రారెడ్డి మరియు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

80 వేల ఉద్యోగాల ప్రకటన చేసి, దొంగచాటుగా ఒక్కో ఉద్యోగం పది లక్షల నుండి కోటి వరకు అమ్ముకున్నారని తెలిపారు ఆయన.  బిఎస్పి పార్టీ ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ లీకెజి విషయాన్ని  బయటకు తెచ్చిందని గుర్తుచేశారు ఆయన. సిబిఐ విచారణ జరిపి అసలైన దోషులను అరెస్ట్ చేయాలని బిఎస్పి తరుపున రాష్ట్రపతికి లేఖ రాశామని తెలిపారు ప్రవీణ్ కుమార్.

ప్రభుత్వం నిరుద్యోగులను నిండాముంచిందన్నారు ఆయన. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత ప్రభుత్వం కోల్పోయిందన్నారు ప్రవీణ్ కుమార్. ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసింది, బిసి రిజర్వేషన్లు పెంచకకుండా మోసం చేసింది. ఎస్సీ వర్గాల అభివృద్ది కోసం ఖర్చు చేయాల్సిన డబ్బుతో ఫాంహౌస్, భంగళాలు కట్టుకున్నారని, అన్ని వర్గాలను మోసం చేసి ఇపుడు అంబేడ్కర్ విగ్రహం పెట్టి మేం అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారని విమర్శించారు ఆయన.

విద్యార్థులు ఉద్యమం చేయక పోతే ఈ తెలంగాణ వచ్చేదా? మీరు ప్రగతి భవన్ వెళ్లేవారా? మీకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు వచ్చేవా? 1200 కోట్లతో సెక్రటేరియట్ నిర్మించేవారా అని ప్రశ్నించారు ప్రవీణ్ కుమార్.  అధికారంలోకి వచ్చాక  కేసీఆర్ విద్యార్థులనే మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హై కోర్టు జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో కూడా చాలా అవకతవకలు జరిగాయన్నారు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. పలుచోట్ల సాంకేతిక లోపం అని చెప్పి, తర్వాత పరీక్ష వాయిదా పడిందని అబద్దాలు చెప్పారని తెలిపారు. దీనిపై ప్రశ్నించిన బిఎస్పి నాయకులను సూర్యపేటలో అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. లీకేజీలపై సిబిఐ ఈడి విచారణ జరపాలని, ఇందులో వేల కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. కమీషన్ బోర్డు, చైర్మెన్ సభ్యులను తొలగించాలని, తొలగించకుండా పరీక్షలు నిర్శహించవద్దన్నారు ఆయన.

అలా చేయలేని పక్షంలో కమీషన్ ఆఫీసు మరియు ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు ప్రవీణ్ కుమార్. నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి తెలంగాణ వచ్చాక లిఫ్ట్, లిక్కర్, లీకేజీ స్కాంలు చేశారని మండిపడ్డారు ఆయన.

గ్రామాలలో బిఎస్ పిని బలోపేతం చేయాలి : ఎంపీ రాంజీ గౌతమ్

గ్రామ గ్రామాన బిఎస్పి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్. తెలంగాణలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు సంతోషంగా లేరని ఆయన అన్నారు. లీకేజీలతో నిరుద్యోగులు ఆవేదనలో ఉన్నారన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. ధనికులు ఇంకా ధనికులుగా మారుతుంటే.. పేదలు ఇంకా పేదరికంలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిఎస్పి పాలనలోనే విద్యార్థులు, రైతులు, మహిళలకు తెలంగాణలో న్యాయం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్, గొల్ల సతీష్, మైనారిటీ కన్వీనర్ అబ్రార్ హుస్సేన్, జిల్లా అధ్యక్షులు బాలరాజు, జిల్లా మహిళా నాయకురాలు వసంత, నియోజకవర్గ ఇంచార్జి గులాని సాయిలు, ప్రఙ్ఞా కుమార్, అధ్యక్షులు తుకారం, సురేష్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking