Take a fresh look at your lifestyle.

బిడ్డ కోసం కేసీఆర్ కిట్, తల్లి కోసం న్యూట్రిషన్ కిట్

0 16

బిడ్డ కోసం కేసీఆర్ కిట్, తల్లి కోసం న్యూట్రిషన్ కిట్
– ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్, ఏప్రిల్ 30 : మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తూ.. సీఎం కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ఇప్పటికే 9 జిల్లాల్లో అమలు అవుతుండగా, అన్ని జిల్లాల్లో పంపిణీ చేయనున్నాం. గర్బిణిగా ఉన్నపుడు న్యూట్రీషన్‌ కిట్, బాలింతగా ఉన్నపుడు కేసీఆర్‌ కిట్‌. న్యూట్రిషన్ కిట్స్ గర్భిణులకు వరంగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వ శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే ప్రకారం, రాష్ట్రంలో మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గింది. మాతృమరణాలు తగ్గించడంలో దేశంలోనే మనం మూడో స్థానంలో నిలిచాం. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు గాను ముఖ్యమంత్రి గారు కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్స్‌ పథకానికి రూపకల్పన చేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌ సూపర్‌ హిట్‌ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్లకు రూపకల్పన చేసింది. నాలుగు ఏఎన్‌సీ చెకప్స్‌, కేసీఆర్‌ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు వంటివి రాష్ట్రంలో మాతా సిస్టం రక్షణకు దోదం చేస్తున్నాయి. నూతన సచివాలయం ప్రారంభం రోజు ముఖ్యమంత్రి గారు గొప్ప పథకం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేయడం సంతోషకరం. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు త్వరలో ఈ కార్యక్రమం మిగతా 24 జిల్లాల్లోనూ ప్రారంభించుతాం.

Leave A Reply

Your email address will not be published.

Breaking