బండేనక బండి కట్టి కేసీఆర్ సభకు..
నిర్దేశం, సూర్యాపేట :
సూర్యపేట నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్లారు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్వయంగా ఎడ్లబండి నడిపి యాత్రను ప్రారంభించారు. నెమ్మికల్ దండు మైసమ్మ తల్లికి మొక్కి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎడ్లబండ్ల యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సుమారు 5 కి.మీ పైగా ఎడ్లబండి నడిపి యాత్రను ఉత్సాహంగా జగదీష్ రెడ్డి ముందుకు నడిపించారు.
జగదీష్ రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బిఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగుతుంది. 24 ఏండ్లు పూర్తి చేసుకుని 25 లో అడుగుపెడుతున్న బిఆర్ఎస్ పార్టీ. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సారధ్యంలో జరుగనున్న 25 ఏండ్ల బీఆర్ఎస్ పండుగ.. భారీ బహిరంగ సభ. సూర్యాపేట నుంచి రైతులు ఎడ్ల బండ్లతో తరలి వెళ్లడం ఆనందంగా వుంది. బండెనక బండి కట్టి.. 16 బండ్లు కట్టి అన్న పాటను సూర్యాపేట రైతులు మళ్ళీ గుర్తు చేస్తున్నరు. రైతాంగంతోపాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నరు. నీడలో ఉన్న వాళ్ళం ఎండనబడ్డామని బాధతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పై కోపంగా ఉన్నారు. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన ఘనత కేసీఆర్ ది. అని వివరించారు జగదీశ్వర్ రెడ్డి.