Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు

0 15

జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు

– నగరానికి నలు వైపులా ఇళ్లు, ఇళ్ల స్థలాలు
– జవహర్‌లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ జర్నలిస్టులకు న్యాయం చేస్తా

మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివా్‌సరెడ్డి

నిర్దేశం, హైదరాబాద్ :

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తుందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. రెండున్నర లక్షల చొప్పున చెల్లించి గడిచిన 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న జవహర్‌లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సుముఖంగా ఉన్నారని చెప్పారు.
బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివా్‌సరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సంఘాలు, ప్రతినిధులు, హౌసింగ్‌ సొసైటీ ప్రతినిధులతో త్వరలో సమావేశమై ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. హైదరాబాద్‌లో జర్నలిస్టులకు నగరానికి నాలుగు వైపుల స్థలాలను గుర్తించి ఎవరికి ఎక్కడ అనువైతే అక్కడే ఇచ్చేలా అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ దైనందిన సమస్యలతో జర్నలిస్టులు వృత్తిపరమైన నైపుణ్యతపై దృష్టి సారించలేకపోతున్నారని, మీడియా అకాడమీ వారిలో నైపుణ్యతను పెంచడానికి కృషి చేయాలన్నారు.
అకాడెమీ మాజీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం అక్రిడిటేషన్‌, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వంటి సమస్యలను సంబంధం లేకుండానే అకాడమీకి అప్పగించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. సీనియర్‌ సంపాదకులు కె.రామచందమ్రూర్తి, సీఎం సీపీఆర్‌ఓ అయోధ్య రెడ్డి, ఏపీప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్‌, సీపీఐ నాయకులు డాక్టర్‌ కె.నారాయణ, పల్లా వెంకట్‌రెడ్డి, సియాసత్‌ ఎడిటర్‌ అమెర్‌ అలీఖాన్‌, ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్‌, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ హ న్మంతరావు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking