ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు

ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు
– సెప్టెంబర్ 15 వరకు అవకాశం

నిర్దేశం, ఢిల్లీ :
ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు గడువును ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైలింగ్ గడువు జులై 31, 2025 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు పెంచినట్లు శాఖ ప్రకటించింది.
ఐటీఆర్ ఫారాల నోటిఫికేషన్‌లో ఆలస్యం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఫారాల్లో చేసిన మార్పులకు సిస్టమ్ సిద్ధం చేయడానికి అదనపు సమయం అవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శాఖ తెలిపింది.
“పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా, జులై 31 గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నాం,” అని ఆదాయపు పన్ను శాఖ ఎక్స్‌లో వెల్లడించింది.
ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చే అంశంగా నిలిచింది, మరింత సౌలభ్యంతో ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేసే అవకాశం కల్పిస్తుంది. ఐటీ శాఖ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చార్టెడ్ అక్కౌంటెంట్ రమేష్ విజ్ఞప్తి చేశారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »