Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే కాంగ్రెస్ కు కష్టమే..

0 15

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే కాంగ్రెస్ కు కష్టమే..

  • డీఎస్ ఫార్ములతో వెళ్లక పోతే కాంగ్రెస్ కు నష్టమే..
  • వామపక్షాలు, బీఎస్పీతోనూ పొత్తులు లేకుంటే..

కాంగ్రెస్ పార్టీ.. నేలను వదిలి సాము చేస్తుందా..? అవును అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అనుకూలంగా మలుచుకోవడానికి పొత్తులు పెట్టుకోక పోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కలలోని మాటే అంటున్నారు వారు. డీఎస్ ఫార్ములతో ముందుకు వెళ్లక పోతే మొదటికే ముప్పు వస్తుందంటున్నారు.

నిర్దేశం, హైదరాబాద్ :

డీఎస్ ఫార్ములంటే..?

2004, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటానికి డీఎస్ ఫార్ములనే కారణమని గుర్తు చేస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ప్రజలలో బలంగా ఉన్న పార్టీలతో పొత్తు లేకుంటే అధికార పార్టీలకు లాభం చేకూరుతుందంటున్నారు. అప్పట్లో డీఎస్ ప్రతి పార్టీతో పొత్తుపెట్టుకుని ఎన్నికలకు పోవడం వల్లే భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

బీఎస్ పీతో పొత్తు..?

ఐపీఎస్ ఆఫీసర్ గా భవిష్యత్ ఉన్నప్పటికీ అట్టడుకు వర్గాలకు అధికారం రావాలని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్ పీ రాష్ట్ర అధ్యక్షుడుగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ అణచబడ్డ వర్గాలను సంఘటితం చేస్తూనే ప్రభుత్వ వ్యతిరేక విదానాలపై సమరశంఖం ఊదారు. ముఖ్యంగా టీఎస్ పీఎస్ సీ లో జరిగిన పరీక్షల అవతవకల విషయంలో ముందుండి పోరాడి నిరుద్యోగుకుల అండగా నిలిసింది కూడా బీఎస్ పీయే. పరీక్ష పేపరుల లీకేజ్ జరిగినప్పుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయంగా ఆందోళన చేయడంతో అతనికి ప్రజలలో మంచి పేరుంది. అలాగే పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటించడంతో గ్రామీణ ప్రాంతాలలో సైతం బీఎస్పీ మంచి పట్టు సాధించింది.

కాంగ్రెస్ – బీఎస్ పీతో పొత్తుంటే..?

మారుతున్న రాజకీయాలలో కాంగ్రెస్ – బీఎస్ పీ పొత్తు పెట్టుకుంటే మెజార్టీ ఎమ్మెల్యేలు గెలిసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా వామపక్షాలతో, బీఎస్ పీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల గెలుపు ధీమాతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభమవుతుందంటున్నారు. తాజా పరిస్థితులలో ప్రతి నియోజక వర్గంలో బీఎస్పీ, వామపక్షాలకు స్వంత ఓట్లు ఉన్నాయనే విషయం కాంగ్రెస్ పార్టీ పెద్దలు విస్మరించవద్దంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking