చట్నీస్ హోటల్ పై ఐటి దాడులు
నిర్దేశం, హైదరాబాద్:
హైదరాబాద్ లోని ప్రముఖ అల్పహార హోటల్ సంస్థ చట్నీస్ హోటల్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆ సంస్థ యాజమాని అట్లూరి పద్మ.. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు వియ్యంకురాలు కావడం గమనార్హం.
ఆమె ఇంటి వద్ద కూడా సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల షర్మిల కుమారుడు రాజారెడ్డితో అట్లూరి పద్మ కుమార్తె వివాహం జరిగింది.
చట్నీస్ హోటల్స్ హైదరాబాద్ సిటీలో ఎంతో ఫేమస్. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఎన్నో బ్రాంచీలు ఉన్నాయి. పదేళ్లుగా చట్నీస్ పేరుతో ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. ఊహించని విధంగా ” చట్నీస్ హోటల్స్ పై ఇన్ కం ట్యాక్స్ అధికారులు దాడులు చేయటం.. వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే ఐటీ దాడులపై చట్నీస్ యాజమాన్యం కానీ, ఐటీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.