Take a fresh look at your lifestyle.

ఇదేనా ప్రెండ్లీ పోలీస్..? అమ్మో ఆ ఎస్సై బూతు మాటలు

0 89

ఇదేనా ప్రెండ్లీ పోలీస్..?
అమ్మో ఆ ఎస్సై బూతు మాటలు వింటే…?
– బాడుకవ్.. లంజ కొడుకా.. అరేయ్.. కాల్చి పాడేస్తా..
– ఎస్సై పై కేసు పెట్టడానికి నిరాకరిస్తున్న ఆర్మూర్ పోలీసులు..

‘‘ఓరేయ్ బామ్మర్ది.. బాడుకవ్.. లంజ కొడుకా.. అరేయ్.. కాల్చి పాడేస్తా.. నన్నెవరనుకున్నావ్ రా.. ఎస్సైని.. బంచెత్… నా బిడ్డను ఇచ్చిన అల్లుడిని వేదిస్తావురా..? ఓరేయ్.. ఆర్మూర్ పోలీసులు పీకుతున్నార్రా…? యాడికి రమ్మంటావో చెప్పురా… నీ ఆర్మూర్ నడి రోడ్ మీదికి వంద మంది మా వైశ్యులను తీసుకుని వస్తా.. యాడికి రమ్మంటువురా..? నేను ఆదిలాబాద్ అడవి బిడ్డానురా.. ’’ అని జగిత్యాల్ జిల్లాకు చెందిన ఓ ఎస్సై రవీందర్ శెట్టి నోటి నుంచి వచ్చిన పచ్చి బూతు మాటలు ఇవి.

ఆ ఎస్సై బూతు మాటలు మీరు వినాలనుకుంటే ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి..

WhatsApp Audio 2024-03-25 at 6.55.43 PM

ఖాకీ డ్రెస్ వేసుకుంటే తాను ఏది చేసినా చెల్లుతుందనే అహంకారంతో ఆ ఎస్సై నోటి నుంచి బూతులు వచ్చాయెమో.. పోలీసు శాఖనే తలదించుకోవాల్సి ఉంటుంది. ప్రెండ్లి పోలీసు అంటూ ఉన్నతాధికారులు సైతం ఎంతో మర్యాదగా వ్యవహరిస్తుంటే బాధ్యతగల ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ శెట్టి మాట్లాడిన బూతు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ఇంతకు గొడవ ఎందుకు..?

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పెర్కిట్ ఎమ్మార్ గార్డెన్ వెనుక చందూరి పద్మావతి నూతన భవనం నిర్మిస్తోంది. అయితే.. ఆ ఇంటి నిర్మాణం అనుమతికి విరుద్దంగా అక్రమ భవన నిర్మాణం చేస్తున్నారని విలేకరులు వెళ్లి ప్రశ్నించడంతో గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణంపై ఆర్మూర్ మున్సిపల్ కమీషనర్ రాజుకు ఫిర్యాదు చేయడంతో అనుమతులు లేని ఆ భవనాన్ని పరిశీలించారు.

అక్రమ నిర్మాణంపై చర్యలు

మున్సిపల్ నుంచి తీసుకున్న అనుమతి ప్రకారం భవనాన్ని నిర్మించలేదని కమిష నర్ రాజు అన్నారు. పెర్కిట్ లోని ఎమ్మార్ గార్డెన్ వెనుక చందూరి పద్మావతి మూడు అంతస్తుల భవన నిర్మాణానికి మున్సిపల్ నుంచి అనుమతి పొందారని, గ్రౌండ్ ఫ్లోర్ లో ఏలాంటి కట్టడాలు చేయకుండా పార్కింగ్ కోసం వదలవలిసి ఉంటందనీ ఆయన వివరించారు. మున్సిపల్ ద్వారా తీసుకున్న అనుమతి ప్రకారం కాకుండా దానికి విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగు తున్నాయని ఫిర్యాదులు రావడంతో కమిష నర్ ఎమ్మార్ గార్డెన్ వెనుక నిర్మిస్తున్న కట్టడాన్ని టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనుమతి ప్రకారం మూడంతస్తుల భవనాన్ని నిర్మించాల్సి ఉండగా నాల్గవ అంతస్తులో అక్రమంగా పెంట హౌస్ ను నిర్మించారని మున్సిపల్ అధికారులు గుర్తించారు. మున్సిపల్ అనుమతి ప్రకారం సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేశారన్నారు. అక్రమ నిర్మాణం చేస్తున్న యజమానురాలు పద్మావతికి నోటీసులు పంపించి చర్యలు తీసుకుంటామని విలేకరులకు తెలిపారు కమిషనర్ రాజు.

బూతు ఎస్సైపై ఫిర్యాదు..

బూతు పదాలతో తమను దూషించిన ఎస్సై రవీందర్ శెట్టిపై చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు విలేకరులు. అయితే.. డబ్బులు అడిగారని ముందుగా మీ మీద కేసు పెట్టాల్సి వస్తోందని పరోక్షంగా ఆ ఎస్సైకి అనుకూలంగా పోలీసు అధికారులు మాట్లాడుతున్నరంటున్నారు విలేకరులు.
ఏది ఏమైనా తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే.. కానీ.. బాధ్యత గల ఎస్సై హోదాలో ఉన్న రవీందర్ శెట్టి మాట్లాడిన బూతు మాటలకు సామాన్యులు సైతం విస్తుపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking