నిర్దేశం, హైదరాబాద్ః ప్రపంచంలో అనేక రకాల మతాలు, కులాలు ఏర్పడ్డాయి. హిందూ మతం కులాలు ఉన్నట్లే, ముస్లింలలో కూడా వివిధ వర్గాలు ఉన్నాయి. వారందరికీ వారి సొంతత ఆచార-సంప్రదాయాలు ఉన్నాయి. వారి నియమ-నిబంధనలు ఇస్లామిక్ చట్టం కిం ఉన్నప్పటికీ, ఇస్లామిక్ చట్టం వివిధ భాగాలుగా విభజించబడింది. సున్నీ ముస్లింలకు హనాఫీ చట్టం, షియా ముస్లింలకు అషారీ చట్టం ఉంది. వారి వివాహాలు కూడా ఈ చట్టాల ప్రకారమే జరుగుతాయి.
గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.9 బిలియన్ల ముస్లింలు ఉన్నారు. 2030 నాటికి 2.2 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచంలో ఇస్లాం రెండవ అతిపెద్ద మతం. ప్రపంచ జనాభాలో 24 శాతం ముస్లింలు ఉన్నారు. అయితే ఇందులో ఎంత మంది సున్నీలు, ఎంత మంది షియాలు ఉన్నారో తెలుసుకుందాం.
సున్నీ ముస్లింలు ఎవరు?
ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న ముస్లింలలో అత్యధిక జనాభా సున్నీ ముస్లింలు. బీబీసీ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని మొత్తం ముస్లింలలో 90 శాతం మంది సున్నీలే ఉంటారు. చాలా మంది సున్నీ ముస్లింలు ఇస్లాంలోని అత్యంత సంప్రదాయవాదతను అనుసరిస్తారు. వాస్తవానికి, సున్నీ అనే పదం ‘అహ్ల్-అల్-సున్నా’ అనే పదం నుంచి వచ్చింది, అంటే ‘సంప్రదాయాన్ని అనుసరించే వ్యక్తులు’ అని అర్థం
సున్నీ ముస్లింలతో పోలిస్తే షియా ముస్లింల జనాభా చాలా తక్కువ. షియా సంఘం మొదట రాజకీయ వర్గంగా మారింది. షియా అనే పదానికి షియాత్ అలీ అంటే అలీ పార్టీ అని అర్థం. అలీ ప్రవక్త మొహమ్మద్ అల్లుడు. అలాగే షియా కమ్యూనిటీ ప్రజలు అలీ, అతని వారసులకు మాత్రమే ముస్లింలను నడిపించే హక్కు ఉందని భావిస్తుంటారు.
షియా, సున్నీ ముస్లింల మధ్య వివాహం జరగవచ్చా?
షియా, సున్నీ ముస్లింలు వివాహానికి సంబంధించి భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి. అయితే షియా, సున్నీ ముస్లింలు ఇద్దరూ ఇస్లామిక్ చట్టాన్ని అనుసరిస్తే ఒకరినొకరు వివాహం చేసుకోవడానికి ఈ చట్టం అనుమతిస్తుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ, చాలా మంది ముస్లింలు తమ సొంత సంఘంలోనే వివాహం చేసుకుంటారు.