ఫోన్ ట్యాపింగ్ లో నెక్ట్స్ కేసీఆరా.. కేటీఆరా..?

ఫోన్ ట్యాపింగ్ లో నెక్ట్స్ కేసీఆరా.. కేటీఆరా..?
– ఎస్ ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు నోరు విప్పాల్సిందే..
– ఫోన్ ట్యాపింగ్ లో క్షేత్రస్థాయి విచారణ
(ఈదుల్ల మల్లయ్య)

ఫోన్ ట్యాపింగ్… కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అతి పెద్ద కుంభకోణం.. ప్రతిపక్షంలోని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా ఖాకీ డ్రెస్ వేసుకుని గులాబీలకు ఊడిగం చేసారు పోలీసు అధికారులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా బీఆర్ ఎస్ పార్టీ కోసం పని చేసిన పోలీసు పెద్దల గుట్టు రట్టు అవుతుంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీసు అధికారులు ఒక్కొక్కరు జైలులో చిప్ప కూడు తింటున్నారు.

ఎస్ ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు నోరు విప్పాల్సిందే
ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసి బీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకు రావడానికి చేసిన పోలీసు అధికారుల గుట్టును సిట్ అధికారులు విప్పుతున్నారు. ఎస్ ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతో ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఎంత వరకు ఉందో ఇప్పటికే నిగ్గు తేల్చారు.
ప్రభాకర్ రావు అరెస్టైతే..
ఫోన్ ట్యాపింగ్ లో అన్నీతానై నడిపిన ఎస్ ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు మెయిన్ పాత్ర పోషించారనేది సిట్ అధికారుల విచారణలో తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తన పదవికి రాజీనామా చేసిన ప్రభాకర్ రావు చెన్నై మీదుగా అమెరికా పారి పోయిన విషయాన్ని సిట్ అధికారులు గుర్తించారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ లండన్ పారి పోయారు. అయితే.. ఈ ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ లో కీలకపాత్ర పోషించారని సిట్ అధికారుల వద్ద సమాచారం ఉంది. విదేశాలకు పారి పోయిన ఈ ఇద్దరి గురించి ఎయిర్ పోర్టులకు లూకౌట్ సర్కులర్ (ఎల్ వోసీ) జారీ చేశారు పోలీసులు.
రాధకిషన్ రావు అరెస్టుతో..
టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావును సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఎస్ ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తాను పని చేశానని రాధకిషన్ రావు సిట్ అధికారుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రణీత్ రావు అరెస్టుతో ఉన్నతాధికారుల లింక్ బహిర్గతమైంది. ఆ లింక్ తోనే అడిషనల్ ఎస్ పీ భుజంగరావు, తిరుపతన్నలతో పాటు డీఎస్పీ గట్టు మల్లు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు వరకు వెళ్లి ఆగింది. అమెరికలో ఉన్న ప్రభాకర్ రావును రప్పిస్తేనే బీఆర్ ఎస్ లోని పెద్దల పేర్లు బహిర్గతం అవుతాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ లో మెయిన్ సూత్రదారి కేసీఆర్ లేదా కేటీఆర్ పేరు ప్రభాకర్ రావు నుంచి వెల్లడి అయ్యే అవకాశాలున్నాయంటున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!