Take a fresh look at your lifestyle.

ఓడి పోతానని రెండు సీట్లలో కేసీఆర్ పోటీయా…?

0 13

ఓడి పోతానని రెండు సీట్లలో కేసీఆర్ పోటీయా…?

అభ్యర్థుల ముందు ప్రకటన సహాసమే..

‘‘బీఆర్ ఎస్ మరోసారి అధికారం లోకి వస్తోంది.. దీనిని ఎవరు ఆపలేరు.. సిట్టింగ్ ల పనితనం నచ్చింది మళ్లీ వాళ్లకే టిక్కెట్లు ఇచ్చాం.. మాటంటే మాటే..’’ ఇది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా చాలా రోజులే ఉంది. అయినా.. అందరి కంటే ముందే అసెంబ్లీకి పోటీ చేయాల్సిన అభ్యర్థుల పేర్లను ప్రకటించి సంచలనం సృష్టించారు కేసీఆర్.

కానీ.. ఇందులో కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం వెనుక ఓడి పోతాననే భయం అతనిలో దాగి ఉందనే నిజాన్ని ప్రతిపక్షలు అనుకూలంగా మలుచుకుంటాయి. అయినా.. నేను అకుకున్నదే చేస్తాను అనే మొండితనం కేసీఆర్ ది.

అభ్యర్థుల ప్రకటనతో అశాజీవులకు రూట్ క్లియర్..

కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో ఒక్కో నియోజక వర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు టిక్కెట్ ఆశించే వారికి నిరాశ ఎదురైంది. ఎన్నికల టైమ్ బాగానే ఉంది కాబట్టి వారిని బుజ్జగించడానికి అధిష్టాన వర్గంకు అవకాశం ఉంటుంది. బుజ్జగింపులకు వినని వారు మరో పార్టీలోకి వెళ్లిన ఎన్నికలలో వ్యూహత్మకంగా వెళ్లడానికి అవకాశం ఉంటుందని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ పై ప్రజలకు ప్రేమ నిజమే..

అభ్యర్థులపై కోపమే..

నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజలలో మంచి పేరు ఉంది. కానీ.. లోకల్ ఎమ్మెల్యేలు నియంతలా వ్యవహరిస్తూ ప్రజలకు దూరంగా ఉన్నారు. కేసీఆర్ చేపిచ్చిన సర్వేలలో ఇదే విషయం తేలినట్లు తెలుస్తోంది. అయినా.. ముందుగానే అభ్యర్థులను ప్రకటించినందున జాగ్రత్త పడుతారని కేసీఆర్ వ్యూహం కావచ్చు..

అయితే… కాంగ్రెస్, టీడీపీ నుంచి వచ్చిన వారికి కూడా టిక్కెట్లు ఇవ్వడం విశేషం.. అయితే.. ఆరోగ్యం బాగలేనందున తమ కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని కేసీఆర్ కు మొర పెట్టుకున్న అతను వినిపించుకోలేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking