Take a fresh look at your lifestyle.

బిఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం

0 17

బిఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం

బీసీల ద్రోహి టబిఆర్ఎస్ పార్టీ 60 శాతం ఉన్న బీసీలకు 20% టిక్కెట్ల ?

అర శాతం ఉన్న వెలమలకు 16 శాతం?

ఐదు శాతం ఉన్న రెడ్లకు 33%? శాతమా?

9% ఉన్న అగ్రకులాలకు 54%?

ఇదెక్కడి సామాజిక న్యాయం?

 కేసీఆర్ ను బీసీలు ఎప్పటికీ నమ్మరు..

ఈ ఎన్నికల్లో బిఆర్ ఎస్ పుట్టి మునగడం ఖాయం

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు  జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, ఆగష్టు 21 : బిఆర్ ఎస్ పార్టీ అబ్యర్థుల జాబితాలో  60 శాతం ఉన్న బీసీలకు 20 శాతం టికెట్లు, ఐదు శాతం ఉన్న రెడ్లకు 33%, అరశాతం ఉన్న వెలమలకు 16% టికెట్లు కేటాయించి మరొకసారి బిఆర్ఎస్ పార్టీ బీసీ ద్రోహుల పార్టీగా నిరూపించుకుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ పై ఫైరయ్యారు.

టిఆర్ఎస్ బీసీలకు కేవలం గతంలో కంటే తక్కువగా 23 టికెట్లు కేటాయించి బీసీలను అవమానించిందని, టిఆర్ఎస్ పార్టీకి కెసిఆర్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనడానికి ఈరోజు బీసీలకు కేటాయించినటువంటి టికెట్ల కేటాయింపే నిదర్శనం అని ఆయన అన్నారు, బీసీలకు పచ్చి మోసం చేసిన టిఆర్ఎస్ పార్టీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి బీసీల సిద్ధం  సిద్ధంగా  ఉన్నారని ఆయన అన్నారు, రెడ్లకు, వెలమలకు టికెట్ల కేటాయింపుల్లో పెద్దపీట వేసి టిఆర్ఎస్ పార్టీ అంటే రెడ్ల వెలమల సమితిగా మారిందని ఆయన ఆరోపించారు.

సిట్టింగ్ సీట్లు ఇచ్చి తెలంగాణలో అగ్రకులాల పాలనను కేసీఆర్ శాశ్వతం చేయాలని చూస్తున్నారని, అందులో భాగంగానే 115 మందిలో 65 మంది అగ్రకులాలకు టికెట్లు ఇవ్వడం చాలా సిగ్గుచేటు అన్నారు బీసీలలో ప్రతి నియోజకవర్గంలో అత్యంత సమర్థులైన వారు ఉన్నప్పటికీ, పార్టీ పట్ల విధేయులుగా ఉండి, పార్టీ కోసం మరియు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన వాళ్ళు ఉన్నప్పటికీ, కేవలం బీసీలనే కారణంతో కేసీఆర్ వారిని పక్కనే పెట్టి అగ్రకులాలకు, అరశాతం, ఐదు శాతం ఉన్నోళ్లకు టికెట్ లు ఇయడం న్యాయమా అని ఆయన ప్రశ్నించారు..

బీసీలకు టికెట్లు ఇవ్వని టిఆర్ఎస్ పార్టీకి బిసీల నుండే పతనం మొదలవుతుందన్నారు బీసీలు అంటే లెక్కలేకుండా వ్యవహరించిన టిఆర్ఎస్ పార్టీకి, కెసిఆర్ కు బీసీలు అంటే బీసీల తడాఖా ఎట్లా ఉంటదో  ఈ ఎన్నికలలో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. రెండు రోజుల్లోనే టిఆర్ఎస్ పార్టీలో టికెట్లు రాకుండా అన్యాయానికి గురైన బీసీ అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పేలా బీసీల కార్యాచరణ ఏర్పాటు ప్రకటిస్తామని  ఆయన తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking