హైదరాబాద్లో బంగ్లాదేశీయుల అక్రమ కార్యకలాపాలు ఎమ్మెల్యే రాజా సింగ్ ట్వీట్

హైదరాబాద్లో బంగ్లాదేశీయుల అక్రమ కార్యకలాపాలు
ఎమ్మెల్యే రాజా సింగ్ ట్వీట్

హైదరాబాద్, నిర్దేశం:
హైదరాబాద్ నగరంలో మరోసారి బంగ్లాదేశీయులు  అక్రమ కార్యకలాపాలు చేస్తూ పట్టుబడ్డారని ఎమ్మెల్యే రాజా సింగ్ ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్లో “నకిలీ హిందూ పేర్లను ఉపయోగించి బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్లో రోహింగ్యాలు చొరబడ్డారు. అలాగే వారు ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో వ్యాపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల  కారణంగా, హైదరాబాద్ పాతబస్తీ  అక్రమ బంగ్లాదేశీలు, రోహింగ్యాలకు బలమైన కోటగా మారింది. అక్రమంగా దేశంలోకి చొరబడిన వీరుసెక్స్ రాకెట్, మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఈ రోజు వెల్లడైంది. ఇలాంటి ఘటనలపై పాతబస్తీలోని ముస్లిం నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇది అందరూ ఆలోచించాల్సిన సమయం.. అక్రమ చొరబాట్లు  కేవలం భద్రతకు ముప్పు మాత్రమే కాదు. హైదరాబాద్ భవిష్యత్తు పై దాడి. తెలంగాణ వ్యాప్తంగా అక్రమ చొరబాటుదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలి.” అని తన ట్వీట్ ద్వారా ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. కాగా బుధవారం సాయంత్రం హైదరాబాద్ కమీషనర్ టాస్క్ ఫోర్స్ , సౌత్ జోన్ టీమ్, చాదర్ఘాట్, ఖైరతాబాద్ పోలీసులు ఏకకాలంలో చాదర్ఘాట్, ఖైరతాబాద్లోని అక్రమ వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించి (18) అక్రమ వలసదారులను అరెస్టు చేశారు. వీరంతా పశ్చిమ బెంగాల్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »