అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులా..?
ఏసీపీకి ఫిర్యాదు చేసిన విద్యార్థి సంఘాలు
నిర్దేశం, హనుమకొండ :
హనుమకొండ పరిధిలోని భీమారంలో గల బీసీ బాలికల స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికితీయడానికి విద్యార్థి సంఘం నాయకులు ఆర్టిఐ ద్వారా సంబంధిత బీసీ సంక్షేమ శాఖను కోరటం జరిగింది. అనంతరం హాస్టల్ అవినీతిపై హన్మకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్ రెడ్డి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై సంబంధిత బీసీ సంక్షేమ శాఖ విచారణ జరుపుతున్న తరుణంలోనే హాస్టల్ వార్డెన్ రేణుకుంట్ల ప్రియాంక తన అవినీతి, అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో , తన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషా బోయిన సంతోష్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం సమంజసం కాదని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఈ విషయమై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని వారు కోరారు.